వరద బాధితులకు ఆర్థికసాయం ప్రక్రియ ప్రారంభం - జీహెచ్‌ఎంసీ వరద సాయం తాజా వార్తలు
13:45 December 09
వరద బాధితులకు ఆర్థికసాయం ప్రక్రియ ప్రారంభం
హైదరాబాద్ మహానగరంలో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ కొనసాగుతోందని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించడంలో నిస్సహాయత వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని జీహెచ్‌ఎంసీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
వరద బాధితులకు ఆర్థిక సాయం అందించే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైందని... ఈ ఒక్క రోజే 7,939 మంది బాధితులకు 7 కోట్ల 90 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది.
ఇదీ చదవండి:భారత్ బయోటెక్‌ను సందర్శించిన విదేశీ రాయబారులు, హై కమిషనర్లు