Sanitation Workers Salaries Hike in Telangana: రాష్ట్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు మే డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను రూ.వెయ్యి చొప్పున పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. జీహెచ్ఎంసీ, జలమండలితో పాటు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. ప్రస్తుత వేతనానికి అదనంగా రూ.వెయ్యి అందనున్నాయి. పెరిగిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు.
Sanitation Workers Salaries Hike: పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంపు - హైదరాబాద్ తాజా వార్తలు
18:07 May 01
పారిశుద్ధ్య కార్మికులకు రూ.వెయ్యి వేతనం పెంచాలని సీఎం నిర్ణయం
ఆర్టీసీ వేతనాలూ..:ఆర్టీసీ కార్మికుల జీతాలు కూడా పెంచాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ‘సఫాయన్న.. నీకు సలాం అన్న’ నినాదంతో పారిశుద్ధ్య కార్మికుల కృషి, త్యాగాలను తెలంగాణ ఏర్పాటు నుంచి గుర్తిస్తూ వారి సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోదంని సీఎం తెలిపారు.
రాష్ట్రంలో కష్టించి పని చేసే ప్రతి ఒక్క కార్మికుడి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తెలంగాణ పల్లెలు, పట్టణాలు గుణాత్మక అభివృద్ధి సాధించడంలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ గొప్పదన్న కేసీఆర్.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన పల్లెలు, పట్టణాలకు అవార్డులు రావడం వెనక వారి కృషి దాగి ఉందని తెలిపారు. పల్లెలు, పట్టణాల్లో పరిస్థితులకు ఎంతో స్పష్టమైన తేడా కనిపిస్తోందని అన్నారు.
కార్మికుల కష్టసుఖాలను తెలుసుకుంటూ, స్పందిస్తూ వారి జీతాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ప్రభుత్వం అండగా నిలబడిందని ముఖ్యమంత్రి తెలిపారు. కార్మికులు కూడా అదే కృతజ్ఞతా భావంతో మనస్ఫూర్తిగా పని చేస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: