తెలంగాణ

telangana

ETV Bharat / state

TRS MLAs poaching case: ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి భద్రత పెంపు.. మామూలుగా లేదుగా! - Increased security for MLA Pilot Rohit Reddy

MLA Pilot Rohith Reddy
MLA Pilot Rohith Reddy

By

Published : Oct 29, 2022, 10:13 AM IST

Updated : Oct 29, 2022, 11:53 AM IST

10:03 October 29

ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి భద్రత పెంపు

additional security for MLA Rohith Reddy తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం భద్రత మరింత పెంచింది. సంచలనం సృష్టించిన ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో పోలీసులు నిర్వహించిన రహస్య ఆపరేషన్‌లో ఆయన కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అదనపు భద్రతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎస్కార్ట్‌ వాహనాన్ని సమకూర్చింది. ఆయన ఇంటి వద్ద పోలీసులు పికెట్‌ను ఏర్పాటు చేశారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని పోలీసులు సమకూర్చారు. ఇప్పటికే రోహిత్‌రెడ్డికి 4+4 భద్రతను ప్రభుత్వం కల్పించింది.

ఈ కేసులో పోలీసులు నిర్వహించిన రహస్య ఆపరేషన్‌ కీలక ఆధారాల్ని సేకరించి పెట్టింది. తనను ప్రలోభపెట్టేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నారంటూ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముందస్తుగానే రంగంలోకి దిగిన పోలీసులు స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో కొన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాలను అమర్చి సంభాషణల్ని రికార్డు చేశారు. సుమారు మూడు గంటలపాటు సాగిన సమావేశాన్ని చిత్రీకరించారు. పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్‌ నివేదికలో ఈ ఆపరేషన్‌ సాగిన తీరును సవివరంగా పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

TRS MLAs Buying Case: నెల రోజుల్లో ప్రభుత్వ పతనం!

TRS MLAs Poaching Case: పోలీసులకు రోహిత్​రెడ్డి సిగ్నల్‌.. ఆ ఒక్క మాటతో రంగంలోకి ఖాకీలు!

Last Updated : Oct 29, 2022, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details