తెలంగాణ

telangana

ETV Bharat / state

చికిత్స కోసం వచ్చే ఇతర రాష్ట్రాల రోగులకు మార్గదర్శకాలు

ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కొవిడ్​ బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. తెలంగాణలోని ఆస్పత్రిలో పడక లభిస్తేనే రావాలని... కొవిడ్ పేషెంట్ల అడ్మిషన్ కంటే ముందే ఆసుపత్రి అనుమతి అవసరమని తెలిపింది.

Telangana news
తెలంగాణ తాజా వార్తలు

By

Published : May 13, 2021, 11:08 PM IST

ఇతర రాష్ట్రాల నుంచి వైద్యం కోసం రాష్ట్రానికి వచ్చే వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు చికిత్స కోసం వచ్చే కరోనా బాధితులకు ముందస్తు అనుమతి తప్పని సరి చేసింది. ఆస్పత్రుల్లో బెడ్‌ దొరక్క అంబులెన్స్‌లోనే ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. బాధితుల సౌలభ్యం కోసం ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది. 040-2465119,9494438351 నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపింది.

పొరుగురాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడులో కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో చాలా మంది వైద్యం కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. దీంతో ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు హైదరాబాద్‌కు కరోనా బాధితుల తాకిడి పెరగడంతో రెండు రోజుల క్రితం సరిహద్దుల్లో పోలీసులు అంబులెన్స్‌లను ఆపేశారు. దీంతో బాధితులు చాలా మంది ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది.

ఇదీ చూడండి:'ఇంట్లోనే ప్రార్థనలు జరుపుకోవాలి... మసీదులో నలుగురికే అనుమతి'

ABOUT THE AUTHOR

...view details