లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు సర్కారు రూ.1500 నగదుతో పాటు ప్రతి వ్యక్తికి 12కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తోంది. కార్డుదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డు అనుసంధానమైతే నేరుగా ఖాతాలోనే రూ.1500 జమ చేస్తున్నారు. బ్యాంకు ఖాతా లేని వారితో పాటు.. బ్యాంకు ఖాతా ఉన్నా ఆధార్ అనుసంధానం కాని వారికి తపాలా కార్యాలయాల్లో నగదు ఇస్తున్నారు.
కరోనా సాయం.. కార్డున్నోళ్లకే నగదు! - telangana post offices latest news
రేషన్ కార్డు ఎవరి పేరున ఉంటే వారే రాష్ట్ర సర్కారు ఇచ్చే నగదు తీసుకునేందుకు తపాలా కార్యాలయాలకు రావాలని తపాలా శాఖ కోరుతోంది. ఈ నెల 23 నుంచి తపాలా కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి.
telangana white ration card holders latest news
ఇలాంటి వారు జంటనగరాల్లో సుమారు 80 వేల మంది వరకు ఉన్నారు. ఇప్పటి వరకూ 16,500 మందికి రూ.2.47 కోట్లు ఇచ్చినట్టు హైదరాబాద్ డివిజన్ తపాలాధికారి వెంకటరామ్‌రెడ్డి చెప్పారు. రేషన్ కార్డు ఎవరి పేరిట ఉంటే వాళ్లే రావాలని సూచిస్తున్నారు.