రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. 2020-21 వానాకాలానికి సంబంధించి కనీస మద్ధతు ధరకు మొక్కజొన్నలు కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు టీఎస్ మార్క్‌ఫెడ్ సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించింది. మొదట ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఒక ఎకరం విస్తీర్ణంలో 21 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని పొరపాటున ప్రకటించింది. అది సవరిస్తూ... తాజాగా 21 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్థన్‌రెడ్డి ఆ పొరపాటు సవరిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు.
మక్కలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు - Maize Procurement in the state
కనీస మద్దతు ధరకు మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాల్‌కు 1850 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.
మక్కలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు
జిల్లాల వారీగా త్వరలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్న దృష్ట్యా క్వింటాల్ మొక్కజొన్న కనీస మద్ధతు ధర 1850 రూపాయలు చొప్పున కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. రైతుల సౌకర్యార్థం.. ముందుగా టోకెన్లు జారీ చేసి ఆ ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన మొక్కజొన్న సరకు కొనుగోలు చేయాలని మార్కెటింగ్ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చూడండి:పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడండి: నిరంజన్ రెడ్డి