రాష్ట్రప్రభుత్వం గత నెలలో విడుదల చేసిన జీవో 27ను రద్దు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక కోరింది. ఏప్రిల్ నెలలో పూర్తివేతనాలు, పింఛన్లు చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి, సీఎస్‌లకు ఈమెయిల్ ద్వారా వినతిపత్రాలను పంపించింది.
గత నెలలో వేతనాలు, పెన్షన్లలో కోత విధించడం వల్ల ఎన్జీవోలు, దిగువశ్రేణి ఉద్యోగులు, పింఛనుదారుల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యారని ఐక్య వేదిక పేర్కొంది. ఉద్యోగుల రుణ వాయిదాల చెల్లింపులపై రిజర్వు బ్యాంకు మారటోరియం విధించినా.. బ్యాంకులు పట్టించుకోలేదన్నారు.