తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR: యాసంగి మొక్కజొన్న కొనుగోలుకు సర్కారు నిర్ణయం.. - యాసంగి మొక్కజొన్న కొనుగోలు

cm kcr
cm kcr

By

Published : Apr 27, 2023, 4:36 PM IST

15:11 April 27

తక్షణం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం

Purchase Of Yasangi Maize: యాసంగి మొక్కజొన్న పంట కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. యాసంగిలో దాదాపు 6.50 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు చేయగా.. 17.37 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రధానంగా మొక్కజొన్నను ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో ప్రధానంగా సాగు చేశారు.

మొక్కజొన్న క్వింటాలుకు ప్రభుత్వ మద్దతుధర రూ. 1962 వెల్లడించింది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల అకాలవర్షాలకు పలు జిల్లాల్లో మక్క పంట కొంత దెబ్బతిన్న తరుణంలో ప్రభుత్వం కొనుగోలుకు నిర్ణయం తీసుకోవడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.. అంతలోనే అకాల వర్షాలు: రెండు వారాల క్రితమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 7100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అయితే రాష్ట్రంలో ఆకాల వర్షాలకు పంటలు మొత్తం దెబ్బ తిన్నాయి. వాటిలో ప్రధానంగా వరి పంటనే అత్యధికంగా దెబ్బతిని రైతన్నకు తీరని నష్టాన్ని మిగిల్చింది.

ఈ నెల 30లోకు సేకరణ పూర్తి కావాలి: యాసంగి ధాన్యాన్ని ఈ నెల 30లోపు మిల్లర్ల నుంచి సేకరించాలని అధికారులకు సీఎం కేసీఆర్​ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో ఆలస్యమైతే క్షమించే పరిస్థితి లేదని సీఎం హెచ్చరించారు. అయితే ఈ అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరగడంతో.. వరి ధాన్యం తడిసిపోయాయి. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి మరి.

తడిసిన ధాన్యం కొంటారో.. లేదో: తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే కొంటారే లేదో అని.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ధాన్యం కేంద్రాల వద్ద బస్తాలతో ఉన్న వరి విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి. గత నెలలో అకాల వర్షాలకు భారీగానే పంట నష్టం జరిగింది. ఆనాడు సీఎం కేసీఆర్​ దెబ్బతిన్న పంటను చూసేందుకు మూడు జిల్లాలో విస్తృత స్థాయిలో పర్యటించారు. నాడు వర్షాలకు పాడైపోయిన పంటలకు ఎకరాలకు రూ. 10వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. వెంటనే అందుకు తగిన జీవోను కూడా విడుదల చేశారు. అయితే నేటివరకు ఆ సాయం రైతులకు అందలేదు. మళ్లీ ఇప్పుడు గత మంగళవారం కురిసిన వర్షాలకు అందకంటే ఎక్కువగానే పంట నష్టపోయింది. మరి ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఏం చేస్తుందో.. అంతేకాకుండా ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details