రాష్ట్రంలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్(kharif marketing season 2021) ఆరంభం కాబోతోంది. ఇప్పటికే వరంగల్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులకు ప్రధాన వాణిజ్య పంట పత్తి సరకు వస్తుండగా... ధాన్యం సేకరణపై(msp for kharif crops 2021) ప్రభుత్వం, భారత పత్తి సంస్థ- సీసీఐ సన్నాహాలు చేస్తుంది. 46.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు అయిన పత్తి పంట... దాదాపు 60 లక్షల పత్తి బేళ్లు మార్కెట్‌కు వస్తాయన్న అంచనాల నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలను సైతం సిద్ధం చేసింది. 61.75 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగవుతున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవడంపై పౌరసరఫరాల శాఖ విస్తృత కసరత్తు చేస్తోంది(telangana government about minimum selling price). ఇవి దృష్టిలో పెట్టుకుని ధాన్యం, పత్తి పంట ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది.
తేమ శాతం ఇలా..
శాసనసభ ఆవరణలో తన ఛాంబర్‌లో పంటల మద్దతు ధరలపై మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రికలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(minister niranjan reddy about msp) చేతుల మీదుగా ఆవిష్కరించారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉండాలి. తేమ శాతం 8కి లోబడి ఆరు, ఏడు శాతం ఉంటే సీసీఐ ద్వారా బోనస్ ధర లభిస్తుంది. తేమశాతాన్ని బట్టి కింది విధంగా ధరలు కేటాయించినట్లు సీసీఐ, మార్కెటింగ్ శాఖ ప్రకటించింది.
తేమశాతం | పొడవు పింజ మద్దతు ధర | పింజరకం మద్దతు ధర |
---|---|---|
6 | రూ.6,025+120.50 | రూ.5,925+118.50 |
7 | రూ.6,025+60.25 | రూ.5,925+59.25 |
8 | రూ.6,025 | రూ.5,925 |
9 | రూ.5,964.75 | రూ.5,865.75 |
10 | రూ.5,904.50 | రూ.5,806.50 |
11 | ధర రూ.5,844.25 | రూ.5,747.25 |
12 | ధర రూ.5,784 | రూ.5,688 |
సమన్వయంతో...
ప్రధాన ఆహార పంట వరి ధాన్యం సాధారణ రకం క్వింటాకు మద్దతు ధర రూ.1940 కాగా... ఏ గ్రేడ్ రకానికి రూ.1960 చొప్పున రైతులకు చెల్లించనున్నారు. ఈసారి క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ధాన్యం మార్కెట్‌కు పోటెత్తనున్న దృష్ట్యా పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో పని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వివిధ పంటలకు కింది విధంగా మద్దతు ధరలు(msp for kharif crops 2021) ప్రకటించింది.
ధరలు వివరాలు ఇలా..
పంటలు | క్వింటాకు మద్దతు ధర |
---|---|
వరి | రూ.1,940(ఏ గ్రేడ్‌కు రూ.1960) |
కందులు | రూ.6,300 |
పెసర | రూ.7,275 |
వేరుశెనగ | రూ.5550 |
మినుములు | రూ.6,300 |
పొద్దుతిరుగుడు | రూ.6,015 |
నువ్వులు | రూ.7,307 |
జొన్నలు | రూ.2,738-2,758 |
సజ్జలు | రూ.2,250 |
రాగులు | రూ.3,377 |