తెలంగాణ

telangana

ETV Bharat / state

మరో రూ.650 కోట్లకు బాండ్లు జారీ చేసిన సర్కార్​.. లిమిట్​ మొత్తం వాడేసినట్టే.. - 2022 23 amount taken by telangana govt

TS Government Debt from Central Government: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన అప్పులో మిగిలి ఉన్న నగదుకు బాండ్లు జారీ చేసింది. దీంతో మొత్తం డబ్బు పూర్తవుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రుణంగా తీసుకోవాల్సిన నగదును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

TS Government Debt from Central Government
TS Government Debt from Central Government

By

Published : Mar 12, 2023, 9:22 AM IST

TS Government Debt from Central Government: కేంద్రం ఒక రాష్ట్రానికి సంవత్సర కాలంలో రాష్ట్ర పెట్టుబడులు, ఆదాయాలు తదితర అంశాలు దృష్టిలో పెట్టుకొని రుణంగా డబ్బులు ఇస్తుంది. ఈ నగదును ఆర్బీఐ ద్వారా రాష్ట్రాలకు అందజేస్తుంది. రాష్ట్రాలు ఇచ్చినప్పుడు బాండ్లను జారీ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన డబ్బులను ఆ ఆర్థిక సంవత్సరంలోనే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ విధంగానే జరుగుతుంది. కేంద్రం నుంచి వచ్చిన నిధుల ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్​ సమావేశాల్లో కొన్ని అంశాల్లో కేటాయింపులు జరుగుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణాల మొత్తం పూర్తైంది.

రూ.650 కోట్లకు బాండ్లు జారీ చేసిన ప్రభుత్వం: రుణ పరిమితికి లోబడి ఈ ఏడాది ఇప్పటికే రూ.37 వేల కోట్లు అప్పుగా తీసుకోగా.. మిగిలిన రూ.650 కోట్ల కోసం ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. వచ్చే ఏడాది రూ.46 వేల కోట్లు రుణంగా తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మరో రూ.650 కోట్లు రుణంగా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రిజర్వ్‌ బ్యాంక్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బాండ్లు జారీ చేసింది. తొమ్మిదేళ్ల కాలానికి జారీ చేసిన బాండ్లను ఆర్​బీఐ మంగళవారం వేలం వేయనుంది. ఆ తర్వాత రూ.650 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరనున్నాయి. వాటిని కలుపుకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్​ఆర్​బీఎం పరిధికి లోబడి తీసుకునే రుణం మొత్తం పూర్తవుతుంది. వాస్తవానికి 2022-23లో రాష్ట్ర ప్రభుత్వం రుణ పరిమితికి లోబడి రూ.55 వేల కోట్లు అప్పుగా తీసుకోవాలని గత బడ్జెట్‌లో ప్రతిపాదించింది.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎంత ప్రతిపాదించారు: అయితే బడ్జెటేతర అప్పుల విషయంలో అభ్యంతరం తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తుల అనంతరం ప్రతిపాదిత అప్పుల్లో కోత విధించి రూ.37,650 కోట్లకు అనుమతించింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం గత వారం వరకు రూ.37,000 కోట్లు అప్పుగా తీసుకుంది. మిగిలిన రూ.650 కోట్ల మొత్తానికి ఆర్థికశాఖ బాండ్లు జారీ చేయడంతో కేంద్రం అనుమతించిన మొత్తం పూర్తి కానుంది. ఆర్థిక సంవత్సరం నెలాఖరుతో ముగియనుండగా పక్షం రోజుల ముందుగానే రుణాల మొత్తం పూర్తి కానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-24లో రూ.46,317 కోట్లను రుణంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రతిపాదిత అప్పు మొత్తాన్ని ఇటీవలి బడ్జెట్‌లో పేర్కొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details