State Govt on GST Evasion Firms: తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ… అదనపు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఎంచుకుంది. కేంద్ర పరిహారం ఆగిపోవడంతో సొంత ఆదాయాన్ని పెంచుకునే దిశలో చర్యలు మొదలయ్యాయి. దాంతో జీఎస్టీ ఎగవేతదారులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. కేంద్రం నుంచి జీఎస్టీ పరిహారం ఈ జూన్ నుంచి ఆగిపోవడంతో సొంతరాబడులు పెంచుకునేలా రాష్ట్రవాణిజ్య పన్నుల శాఖ చర్యలు చేపట్టింది.
దీంతో వ్యాపార సంస్థలవారీగా ఆయా సంస్థలు వేస్తున్న రిటర్న్‌లను... హైదరాబాద్ ఐఐటీ అధికారులతో కలిసి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పరిశీలించారు. ఇందుకోసం ఇప్పటికే 16 మంది చురుకైన అధికారులను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా తనిఖీలు నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నారు. వాటితోపాటు మరికొన్ని బడా సంస్థల కార్యకలాపాలపైనా నిఘాపెట్టారు. వాటి వ్యాపార లావాదేవీలు, ఆర్ధిక స్థితిగతులు పరిశీలిస్తున్నారు.