ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులంతా ఉత్తీర్ణులేనని తెలిపారు. అనుత్తీర్ణులను సప్లిమెంటరీలో పాస్ అయినట్లు పరిగణిస్తామని చెప్పారు.
ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు: మంత్రి సబిత - ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్ష రద్దు
17:13 July 09
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ విద్యార్థులంతా ఉత్తర్ణులే
10 రోజుల్లో రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ ఫలితాలు
ప్రభుత్వ నిర్ణయంతో 1.47 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని తెలిపారు. జులై 31 తర్వాత కళాశాలల్లో మెమోలు పొందవచ్చని వెల్లడించారు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ ఫలితాలను 10 రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం కోసమే సీఎం పరీక్షలను రద్దు చేశారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ స్ఫూర్తిగా నూతన సచివాలయం