ఆ రెండు రాష్ట్రాలకు బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
17:23 September 26
కర్ణాటక, మహారాష్ట్రకు బస్సులు నడిపేందుకు ఆర్టీసీకి ప్రభుత్వం అనుమతి
ఈనెల 28 నుంచి కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు అంతర్రాష్ట్ర బస్సులను నడిపేందుకు టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. కర్ణాటక, మహారాష్ట్ర బస్సులు కూడా తెలంగాణకు వచ్చేందుకు అనుమతులు లభించాయి. బెంగళూరుకు బస్సు సర్వీసులకు మాత్రం ప్రభుత్వం అనుమతివ్వనివ్వలేదు.
ఆ రాష్ట్రాలకు చెందిన రాయచూర్, బీదర్, గుల్బర్గా, నాందేడ్, ముంబయి, పుణే, నాగ్‌పుర్, చంద్రాపుర్ మార్గాల్లో టీఎస్ఆర్టీసీ బస్సులు తిప్పనున్నట్లు అధికారులు వెల్లడించారు.