తెలంగాణ

telangana

ETV Bharat / state

త్వరలో హైదరాబాద్‌లో అతిపెద్ద ఫార్మా క్లస్టర్ : కేటీఆర్ - hyderabad latest news

TS agreement with Bristol Myers pharma company: అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ బ్రిస్టల్ మేయర్స్​తో మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో 1500 మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్ తెలిపారు.

TS agreement with a USA pharma company
TS agreement with a USA pharma company

By

Published : Feb 23, 2023, 11:56 AM IST

Updated : Feb 23, 2023, 1:10 PM IST

అతి పెద్ద ఫార్మా క్లస్టర్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాం: కేటీఆర్

TS agreement with Bristol Myers pharma company: అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ బ్రిస్టల్ మేయర్స్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకుంది. వంద మిలియన్ డాలర్ల పెట్టుబడితో కంపెనీ స్థాపనకు ముందుకొచ్చిన ఈ సంస్థ ద్వారా 1500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్​లో ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

తయారీ రంగంలోనూ బ్రిస్టల్ మేయర్స్ దృష్టి సారించాలని కోరినట్లు కేటీఆర్ చెప్పారు. బయో ఆసియా ప్రారంభం అవుతున్న తరుణంలో ఇది ఒక మంచి పరిణామమని అన్నారు. ఈ మేరకు లైఫ్ సైన్సెస్​లో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని సవరించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అనుమతుల ఇబ్బంది హైదరాబాద్ ఫార్మా సిటీలో నేరుగా భూకేటాయింపులు చేస్తే వెంటనే కంపెనీ ప్రారంభించుకునే వెసులుబాటు లభిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.

పరిశోధన, క్లినికల్ ట్రయల్స్​పై దృష్టి పెడతామని మంత్రి చెప్పారు. రానున్న మూడేళ్లలో వంద మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం పెట్టుబడులు పెట్టేందుకు ఉత్తమ నగరమని.. డ్రగ్స్​కు సంబంధించిన అన్ని రంగాలపై దృష్టి సారిస్తామని వెల్లడించారు.

'హెల్త్ కేర్ , లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్​లో ఎంతో నైపుణ్యం ఉందని బ్రిస్టల్ మేయర్స్ కంపెనీ ఎండీ సమ్మిత్ హిరావత్ అన్నారు. నాలుగైదేళ్లలో హైదరాబాద్ ఎంతగానో అభివృద్ధి చెందిందని, పెట్టుబడులు పెట్టేందుకు ఉత్తమ నగరంగా మారిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తామని, డ్రగ్స్​కు సంబంధించిన అన్ని రంగాలపై దృష్టి సారిస్తామని తెలిపారు.

'తెలంగాణలోని జీవ ఔషధ రంగం ఎదైతే ఉందో, చాలా బలంగా ఎదుగుతా ఉంది. కాబట్టి బయో ఆసియా ప్రారంభమవుతున్న ఈ సందర్భంలో జీవ ఔషధ రంగంలోని యువతకు చాలా మంచి వార్త. ఇప్పటిదాకా ఇండియాలో లేని ఒక కొత్త సంస్థ మన దగ్గరికి రావడం, అది కూడా హైదరాబాద్​ను ఎంచుకోవడంతో చాలా ఆశాభావంతో ఉన్నాను. హైదరాబాద్ ఫార్మా సీటీ గురించి కూడా వారికి వివరించాను'. -కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి

ఇవీ చదవండి:

Last Updated : Feb 23, 2023, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details