తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా కష్టకాలంలో కళాకారులకు అండగా నిలవాలి' - Telangana Folk Artists Association founding president kondal rao

కరోనా సమయంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి కోరారు. హైదరాబాద్​లో 100 మంది జానపద కళాకారులు వేయి రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు.

telangana government advisor k.v. ramanachari helped folk artists
జానపద కళాకారులకు కేవీ రమణాచారి సాయం

By

Published : Aug 25, 2020, 3:56 PM IST

కరోనా ఆపత్కాలంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు తమకు తోచినంత సాయం చేయాలని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి కోరారు. కొవిడ్ వల్ల ఉపాధి కోల్పోయిన జానపద కళాకారులకు చేయూతనందించారు. జానపద కళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొండలరావు ఆధ్వర్యంలో 100 మంది జానపద కళాకారులకు వేయి రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.

కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ ఉపాధి కోల్పోయిన జానపద కళాకారుల కష్టాలను గుర్తించిన సంఘం వారికి సాయం చేయడం అభినందనీయమని రమణాచారి అన్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాకు చెందిన 100 మంది కళాకారులు ఈ సాయంతో లబ్ధి చెందారని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ కష్టకాలంలో ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని రమణాచారి విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details