తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉపశమనం - telangana governement extended the dates for enrollment of reocounting,reverification

రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ విషయంలో ఈ నెల 30 వరకు గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు సంవత్సరాలకు కలిపి 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

telangana-governement-extended-the-dates-for-enrolling-reocounting-reverification
ఇంటర్ విద్యార్ధులకు ఉపశమనం

By

Published : Jun 24, 2020, 8:26 PM IST

ఇంటర్‌ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం ఇచ్చింది. ఇంటర్‌ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ విషయంలో ఈ నెల 30 వరకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గత గురువారం ఇంటర్‌ పరీక్షల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాలకు కలిపి 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

ఇంటర్‌ తొలి సంవత్సర ఫలితాల్లో 2,88,383 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా మొత్తం 60.01 శాతం ఉత్తీర్ణులయ్యారు. తొలి సంవత్సర ఫలితాల్లో బాలికలదే పైచేయి. 67.47 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా, బాలురు 52.30 శాతం మంది పాసయ్యారు. రెండో సంవత్సర ఫలితాల్లో 2,83,462 మంది ఉత్తీర్ణత పొందగా, మొత్తం 68.86 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ABOUT THE AUTHOR

...view details