తెలంగాణ

telangana

ETV Bharat / state

గంగపుత్రులకు క్షమాపణ చెప్పడానికి సిద్ధమే: తలసాని - తెలంగాణ వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గంగపుత్రుల నిరసనల నేపథ్యంలో తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దీటి మల్లయ్య, కార్యవర్గ సభ్యులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ని కలిశారు. చెరువులు, కుంటలు ఉన్న ప్రతి చోట గంగపుత్రులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జీవో నం.6 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

telangana gangaputra association met minister talasani srinivas yadav in hyderabad
గంగపుత్రులకు క్షమాపణ చెప్పడానికీ సిద్ధమే: తలసాని

By

Published : Jan 20, 2021, 10:04 AM IST

కోకాపేట్ ప్రసంగంలోని వ్యాఖ్యలు కేవలం అక్కడున్న వారిని ఉత్తేజపరచడానికేనని, గంగపుత్రుల పట్ల వ్యతిరేక ధోరణి ఆయన ఉద్దేశం కాదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. అవసరమైతే గంగపుత్రులకు క్షమాపణ చెప్పడానికైనా సిద్ధమేనని పునరుద్ఘాటించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గంగపుత్రుల నిరసనల నేపథ్యంలో తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దీటి మల్లయ్య, కార్యవర్గ సభ్యులు మంత్రిని ఆయన కార్యాలయంలో నేడు కలిశారు.

'గంగపుత్రులకే అవకాశం ఇవ్వాలి'

రాష్ట్రంలోని గంగపుత్ర, బెస్తలకు తొలి ప్రాధాన్యం ఇచ్చిన సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని దీటి మల్లయ్య బెస్త మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సొసైటీల్లో గంగపుత్రులకే అవకాశం ఇవ్వాలని, వారు లేని ప్రదేశాల్లో జనాభా ప్రాతిపదికన కేటాయించాలని డిమాండ్ చేశారు. దానికి తగ్గట్టుగా ప్రత్యేక జీవో ప్రవేశ పెట్టి సమస్య పరిష్కారం చేయాలని కోరారు. జీవో నం.6 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

'మాకే తొలి ప్రాధాన్యం'

మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వానికి వృత్తి నైపుణ్య పరీక్ష సంబంధించిన జీవో నం.74ను వెంటనే అమలు చేయాలని కోరారు. చెరువులు, కుంటలు ఉన్న ప్రతి చోట గంగపుత్రులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మత్స్య సహకార సంఘాల సమాఖ్య ఛైర్మన్​గా గంగపుత్రులను మాత్రమే ఎంపిక చేయాలన్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి మత్స్యకారుల కార్పొరేషన్, గంగపుత్రుల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

'నిధులు మంజూరు చేయాలి'

హైదరాబాద్, ఉప్పల్​లో ఆత్మగౌరవ భవనానికి హామీ ఇచ్చిన ప్రకారం మూడు ఎకరాల భూమి, రూ.3కోట్ల నిధులను మంజూరు చేయాలన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 150 డివిజన్లలో సంచార వాహనాలు గంగపుత్రులకే కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ గంగపుత్ర సంఘం ఉపాధ్యక్షుడు కాపర్తి మోహన్ కృష్ణ బెస్త, కార్యదర్శి శీలం రాజ్ కుమార్ బెస్త, అధికార ప్రతినిధి పాక మధుసూదన్ బెస్త, ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవేందర్ బెస్త, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నెన్నెల నర్సయ్య బెస్త, నల్గొండ జిల్లా యూత్ అధ్యక్షుడు అంబటి ప్రణీత్ బెస్త తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:శిరస్త్రాణ ధారణ భారం... జరిమానాలూ బేఖాతరు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details