తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీ భవన్​లో అవతరణ దినోత్సవ వేడుకలు - టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఐదో అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. హైదరాబాద్​ గాంధీ భవన్​లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో కాంగ్రెస్​ సీనియర్​ నాయకులు పాల్గొన్నారు.

గాంధీ భవన్​

By

Published : Jun 2, 2019, 11:51 AM IST

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​ గాంధీ భవన్​లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో జానారెడ్డి, వీహెచ్​, ఎమ్యెల్సీ జీవన్ రెడ్డి, కుసుమ కుమార్, షబ్బీర్ అలీ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

సోనియా గాంధీ వల్లే తెలంగాణ

సోనియాగాంధీ వల్లే ఎన్నో ఏళ్ల తెలంగాణ కల సాకారమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్​ ఎంపీల పోరాటం వల్లే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని ప్రశంసించారు. 60 ఏళ్లలో 69 వేల కోట్ల అప్పులైతే నూతన రాష్ట్రం ఏర్పాడ్డాక 2 లక్షల 60 వేల కోట్లు వరకూ పెరిగాయని అన్నారు. అందుకు తగిన విధంగా అభివృద్ధి జరగలేదని వెల్లడించారు. ఎన్నికల్లో ఏ హామీని తెరాస ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా కేసీఆర్​ పాలన ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో తెరాసను ఓడించేది హస్తం పార్టీయేనని పునరుద్ఘాటించారు.

గాంధీ భవన్​లో రాష్ట్ర అవతరణ వేడుకలు

ఇదీ చూడండి : 'అవినీతిని అంతమొందించేందుకు కొత్త రెవెన్యూ చట్టం'

ABOUT THE AUTHOR

...view details