Telangana Haritotsavam On June 19th :మీరు సోషల్ మీడియాలో యమా యాక్టివ్గా ఉంటారా..? రీల్స్ చేయడం.. వీడియోలు పోస్టు చేయడం మీకు ఇష్టమా..? ముఖ్యంగా మీరు ప్రకృతి ప్రేమికులా..? అయితే మీకో సూపర్ ఛాన్స్. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ వీడియోలు, రీల్స్ చేసే అలవాటు మీకు ఉంటే... వెంటనే రీల్స్, వీడియోలు చేసేయండి.. అవార్డులు పొందండి.. అంటోంది రాష్ట్ర అటవీ శాఖ. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపడుతున్న హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా.. హరితహారం, పచ్చదనం, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తూ రీల్స్, వీడియోస్ చేసి పంపితే ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి అవార్డులు ఇస్తామని అటవీ శాఖ తెలిపింది.
Telangana Forest Ministry Reels Challenge :రాష్ట్ర అవతరణదశాబ్ది ఉత్సవాల్లో భాగంగానెల 19వ తేదీన హరితోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోజు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సందర్భంగా పచ్చదనం ప్రాముఖ్యత, హరితహారాన్ని మరింతగా ప్రోత్సహించడంతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హరితహారం, పచ్చదనం, చెట్ల ప్రాముఖ్యత అర్బన్ ఫారెస్ట్ పార్కులపై రీల్స్, వీడియోలను ఒక నిమిషం ఉండేలా tkhh2023@gmail.comకు పంపాలని అటవీశాఖ తెలిపింది. నిమిషంలోపు ఉంటే ఇంకా బాగుంటుందని పేర్కొంది.
Telangana forest department reels challenge :తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 19న రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా హరితోత్సవం నిర్వహించేందుకు రాష్ట్ర అటవీశాఖ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. జూపార్కులు, జాతీయ పార్కులు, పట్టణ అటవీ ఉద్యానవనాల్లోకి జూన్ 19వ తేదీన సందర్శకుల్ని ఉచితంగా అనుమతించాలని నిర్ణయించింది. పిల్లల్లో పర్యావరణ స్పృహ పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనుంది. వర్షాకాలం అనుగుణంగా తొమ్మిదో విడత హరిత హారాన్ని ప్రారంభించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. సాగునీటి శాఖ ఆధ్వర్యంలో ఉన్న భూముల్లో ప్రత్యేక హరితోత్సవం నిర్వహించాలని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ నిర్ణయించారు. దశాబ్ది సంపద వనాలుగా వాటికి పేరు పెట్టాలని సూచించారు.
అప్పటి మొక్కలు.. నేడు భారీ వృక్షాలు..రాష్ట్రంలో ఇప్పటి వరకు చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా ఎదిగాయి. రహదారులకు ఇరువైపులా పెరిగినవి చల్లటి నీడనివ్వడమే కాకుండా ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు చల్లదనంగా మారాయి. వాటి చుట్టుపక్కల కొత్త శోభను తెచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 8 విడతలుగా హరిత హారం కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ సంస్థలు, ప్రధాన రహదారుల్లో నాటగా నర్సరీల్లో లక్షల మొక్కలు మిగిలాయి. వీటిని అధికారులు సంరక్షిస్తున్నారు.
ఇవీ చదవండి: