రాష్ట్ర ఖజానా లోటును పూరించేందుకు సర్కారు కసరత్తు ప్రారంభించింది. రానున్న నాలుగు నెలల కార్యాచరణతోపాటు 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పనపై మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు.
శాఖలవారీ కేటాయింపుల వ్యయం, నాలుగు నెలల్లో పాటించాల్సిన ఆర్థిక నియంత్రణపై దిశానిర్ధేశం చేయనున్నారు. రాష్ట్ర ఖజానకు ప్రతి నెలా కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా నిధులు తగ్గడం, రాబడుల అంచనాల్లో అంతరం పెరుగినట్లు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా, పెండింగ్ నిధులు, జీఎస్టీ పరిహారం, కేంద్ర ప్రాయోజిత పథకాలకు అందిన నిధుల లెక్కను మంత్రి మండలికి అర్థిక శాఖ వివరించనుంది.
ఆదాయం 45... వ్యయం 50
రుణాలు కాకుండా రాష్ట్రానికి సొంత పన్నుల రాబడి, కేంద్ర పన్నుల వాటా గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లు, పన్నేతర రాబడిని లక్షా 13 వేల 99 కోట్లుగా అంచనాల వేయగా... అక్టోబర్ చివరి నాటికి 51వేల 355 కోట్లు మాత్రమే వచ్చింది. ఇది రాబడుల అంచనాల్లో 45 శాతం మాత్రమే చేరుకుంది. అప్పుల ద్వారా 24 వేల 81 కోట్లు సమకూర్చుకోవాల్సి ఉండగా... అక్టోబరు నాటికే 17 వేల 500 కోట్లు రుణం తీసుకుంది. లక్షా 37 వేల 226 కోట్లు అంచనా వేయగా... ఇప్పటికే 68 వేల 882 కోట్ల వ్యయంతో 50 శాతం ఖర్చు చేసింది.
ఆర్థిక మందగమనం కొనసాగనుందా?
నాలుగు నెలల్లో కూడా ఆర్థికంగా మందగమనం కొనసాగనుందని ఆర్థకశాఖ అంచనా వేసింది. దీనికి అనుగుణంగా ఖర్చును నియంత్రించుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వేతనాలు, పింఛన్లు, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య పథకాల నిధుల్లో కోతలు ఉండకుండా... ఎక్కడెక్కడ నియంత్రించుకోవాలో సమీక్షించనున్నట్లు తెలిపారు.
అక్టోబర్ వరకు వచ్చిన పన్నుల రాబడులు గత ఏడాది కంటే తగ్గాయి. ప్రధానంగా జీఎస్టీ రాబడి, కేంద్ర పన్నుల వాటాలో తగ్గుదల... రాష్ట్ర ఆదాయంపై ప్రభావం చూపాయి. జీఎస్టీలో గత ఏడాది కంటే తక్కువ రాబడులు ఉన్నాయి. రాష్ట్ర రాబడుల్లో కీలకమైన అమ్మకం, ఎక్సైజ్ పన్నుల్లో గతేడాది కంటే స్వల్పంగా పెరిగింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ రాబడి మాత్రం లక్ష్యంలో 60 శాతం పైగా వచ్చింది.
రాష్ట్ర పన్ను, ఇతర రాబడులు అక్టోబర్ వరకు రూ. కోట్లలో
పన్ను, రాబడులు 2019 లక్ష్యం 2019 అక్టోబర్ శాతం