రాష్ట్ర వార్షిక బడ్జెట్లో వెనుకబడిన వర్గాల కోసం రూ.4,356.82 కోట్లు ప్రతిపాదించారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల ఆత్మగౌరవం ప్రతిబింబించే విధంగా హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలను ప్రభుత్వం నిర్మించనుందని ప్రకటించారు. ఈ భవనాలు ఆయా వర్గాల విద్య, సాంస్కృతిక, సామాజిక వికాసానికి దోహదపడతాయని, వారి ఐక్యతా నిలయాలుగా నిలుస్తాయని వెల్లడించారు.
వెనుకబడిన వర్గాలకు రూ.4,356.82 కోట్లు - తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు
వెనుకబడిన వర్గాల దుస్థితిని దృష్టిలో ఉంచుకుని వారి సమగ్ర అభివృద్ధికి తెలంగాణ సర్కార్ కృషి చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం రూ.4,356.82 కోట్లు ప్రతిపాదించారు.
వెనుకబడిన వర్గాలకు రూ.4,356.82 కోట్లు
స్థిరమైన వృత్తి, స్థిరమైన జీవనం లేకుండా నేటికీ కొన్ని బీసీ కులాల ప్రజలు అత్యంత దయనీయంగా జీవనం గడుపుతున్నారని, వారి సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హరీశ్ తెలిపారు.
- ఇదీ చూడండి : తెలంగాణ బడ్జెట్.. రూ.1,82,914 కోట్లు
Last Updated : Mar 8, 2020, 3:37 PM IST