రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాక తాజాగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఖాతాలోకి చేరింది (Telangana Health Minister harish rao. ఈటల రాజేందర్ నుంచి తప్పించినప్పటి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ గత ఐదు నెలలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దే ఉంది. అప్పటికే సాధారణ పరిపాలన, ప్రణాళిక, వాణిజ్యపన్నులు, నీటిపారుదల, రెవెన్యూశాఖలు సీఎం వద్ద ఉన్నాయి. వైద్య, ఆరోగ్యశాఖను తన వద్దే ఉంచుకున్న కేసీఆర్... సంబంధిత పనులను కేటీఆర్, హరీశ్ రావుకు అప్పగించారు. ప్రజారోగ్యంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి హరీశ్ రావును ఛైర్మన్‌గా నియమించారు. కొవిడ్ పరిస్థితి, చికిత్స, వ్యాక్సినేషన్ తదితరాలపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో హరీశ్ రావు కొన్ని సమీక్షలు కూడా నిర్వహించారు.
అప్పుడే అనుకున్నారు
వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలను ఆయనకు అప్పగిస్తారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అప్పటి ఊహాగానాలను నిజం చేస్తూ తాజా పరిణామాల నేపథ్యంలో హరీశ్ రావుకు వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ అదనంగా అప్పగించారు (Telangana Health Minister harish rao. కొత్త వైద్యకళాశాలలు, హైదరాబాద్, వరంగల్ నగరాల్లో కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం లాంటి కీలక పనులతో పాటు కొవిడ్ మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో పూర్తి స్థాయి మంత్రి ఉండాలన్న ఉద్దేశంతో హరీశ్ రావుకు సీఎం బాధ్యతలు అప్పగించినట్లు చెప్తున్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి తనవద్దనున్న శాఖలను మంత్రులకు ఇవ్వడం, మార్పులు చేసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.