తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరి రివర్​ ఫ్రంట్​ టూరిజానికి రూ.300 కోట్లు

హైదరాబాద్​ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి రూ.50 వేల కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​ రావు తెలిపారు. ఈ ఏడాది నగర అభివృద్ధికి బడ్జెట్​లో రూ.10 వేల కోట్లు కేటాయించడం పెద్ద నిర్ణయమని పేర్కొన్నారు.

telangana finance minister harish rao about budget 2020-21
గోదావరి రివర్​ ఫ్రంట్​ టూరిజానికి రూ.300 కోట్లు

By

Published : Mar 8, 2020, 4:15 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల గోదావరి నది 150 కిలోమీటర్లు దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల వెడల్పుతో 365 రోజులు సజీవంగా కళకళలాడుతోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. రాష్ట్రం నుంచే గాక, ఇతర రాష్ట్రాల ప్రజలు నదిని, ప్రాజెక్టు నిర్మాణాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు సందర్శిస్తున్నందున ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. గోదావరి రివర్​ ఫ్రంట్​ టూరిజానికి బడ్జెట్​లో రూ.300 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

గోదావరి రివర్​ ఫ్రంట్​ టూరిజానికి రూ.300 కోట్లు

ABOUT THE AUTHOR

...view details