తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్ బీసీల పక్షపాతి: మంత్రి శ్రీనివాస్ ​గౌడ్

ముఖ్యమంత్రి కేసీఆర్​ బీసీలకు న్యాయం చేస్తున్నారని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. మున్సిపాలిటీల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తుచేశారు. హైదరాబాద్​లో మరో మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​తో కలిసి ఆయన మాట్లాడారు.

telangana excise minister srinivas goud about budget allocation for BC welfare
'సీఎం కేసీఆర్​ బీసీలకు న్యాయం చేస్తున్నారు'

By

Published : Mar 9, 2020, 10:58 AM IST

Updated : Mar 9, 2020, 11:16 AM IST

కేంద్రంలో బీసీలకు ప్రత్యేక శాఖ ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎన్నోసార్లు డిమాండ్ చేశారని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్ తెలిపారు. కేసీఆర్​ బీసీలకు న్యాయం చేస్తున్నారని అన్నారు. మున్సిపాలిటీల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తు చేశారు. మార్కెట్​ ఛైర్మన్లు, నామినేటెడ్​ పదవుల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారని వెల్లడించారు.

కేసీఆర్ బీసీల పక్షపాతి: మంత్రి శ్రీనివాస్ ​గౌడ్

కాంగ్రెస్​ హయాంలో బీసీ ఎమ్మెల్యేల సంఖ్య కూడా అతి తక్కువగా ఉండేదన్న మంత్రి.. ప్రభుత్వ వసతిగృహాల్లో నాణ్యమైన భోజనం కోసం గతంలో ఎన్నో ధర్నాలు జరిగేవని తెలిపారు. విపక్షాలు ఇప్పుడు వెళ్లి ప్రభుత్వ వసతి గృహాలు పరిశీలిస్తే వాస్తవం తెలుస్తుందన్నారు.

ప్రతి పథకంలోనూ 90 శాతం లబ్ధిదారులు అణగారిన వర్గాలేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకాన్ని కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు ప్రశంసించారని గుర్తుచేశారు.

Last Updated : Mar 9, 2020, 11:16 AM IST

ABOUT THE AUTHOR

...view details