భౌతిక దూరం పాటిస్తూ.. కల్లు గీసుకోవడానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుమతినిస్తున్నట్లు తెలిపారు. కల్లు కాంపౌండ్లు తెరవద్దని అన్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో కల్లు గీయవద్దని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ... కల్లు విక్రయాలు జరపాలని పేర్కొన్నారు.
ఔషధ గుణాలు ఉన్నటువంటి నీరాను తాగొచ్చని చెప్పారు. త్వరలో ట్యాంక్ బండ్పై నీరా అమ్మకాలు జరుపుతామని వెల్లడించారు. మాంసం, గుడ్లు తినాలని ప్రజలకు సూచించారు. కులవృత్తుల పునరుద్ధరణ జరుగుతుందని స్పష్టం చేశారు. 40 లక్షల మంది గీత కార్మికుల కుటుంబాలు కరోనా లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. లాక్డౌన్ నేపథ్యంలో కల్లు అమ్మకాలు నిలిచిపోయాయని అన్నారు. చెట్టు పన్ను రద్దు చేసి గీత కార్మికులకు భరోసానిచ్చినట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా 3 లక్షల ఈత, తాటి చెట్లు నాటినట్లు చెప్పారు. సిరిసిల్లలో ప్రత్యేకంగా కర్జురా చెట్లు నాటినట్లు పేర్కొన్నారు.