కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఈఎన్‌సీ మరో లేఖ - తెలంగాణ తాజా వార్తలు
18:02 October 07
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఈఎన్‌సీ మరో లేఖ
తాగునీటి వినియోగం, లెక్కింపు విషయమై కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది (enc letter to krishna board). వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి కోరిన వివరణకు సమాధానంగా కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు(krmb) ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. బచావత్ ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం తాగునీటి వినియోగాన్ని 20 శాతమే లెక్కించాలని లేఖలో స్పష్టం చేశారు.
తాగునీటి వినియోగాన్ని 15 శాతంగానే లెక్కించాలని ఇటీవల కేంద్ర జలసంఘం పేర్కొందని కూడా గుర్తు చేశారు. 2051 నాటి జనాభా అవసరాలకు అనుగుణంగా తెలంగాణకు కృష్ణా జలాల్లో 75.32 టీఎంసీల నీరు ఇవ్వాలని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌ను కోరుతున్నామని బోర్డుకు తెలంగాణ తెలిపింది. 75.32 టీఎంసీల్లో 20 శాతం అంటే 15.06 టీఎంసీలుగానే లెక్కించాలని బ్రిజేష్ ట్రైబ్యునల్‌ను కోరుతున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:krmb:ఈ నెల 12న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం