తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్​ఈసీని కలిసిన రాష్ట్ర ఎన్నికల నిఘా వేదిక - ఎన్నికల సంఘాన్ని కలిసిన రాష్ట్ర ఎన్నికల నిఘా వేదిక

30 స్వచ్ఛంద సంస్థలతో ఏర్పడిన తెలంగాణ నిఘా వేదిక ప్రతినిధులు ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డిని కలిశారు. పుర ఎన్నికల్లో అవినీతి అక్రమాలను అరికట్టాలని కోరారు.

Telangana election watch meet sec today
ఎస్​ఈసీని కలిసిన రాష్ట్ర ఎన్నికల నిఘా వేదిక

By

Published : Jan 16, 2020, 8:48 PM IST


రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక కలిసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని నిఘా వేదిక కోరింది. ఈ మేరకు 30 స్వచ్ఛంద సంస్థలతో ఏర్పడిన తెలంగాణ నిఘా వేదిక ప్రతినిధులు ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డిని కలిసి మెమోరాండం సమర్పించారు.

ఎన్నికల సందర్భంగా అవినీతి అక్రమాలను అరికట్టి ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలని నిఘా వేదిక ప్రతినిధులు కోరారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో తమ ప్రతినిధులు పనిచేస్తున్నారని నాగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

ఇవీ చూడండి: 'తెరాస మోసాలే... పుర ఎన్నికల్లో మన అస్త్రాలు'

ABOUT THE AUTHOR

...view details