Telangana Election Survey 2023: తెలంగాణలో చలిగాలులు వీస్తున్నా.. రాజకీయ పరిణామాలు వేడెక్కిస్తున్నాయి. నాయకుల గెలుపోటములపై స్పష్టత రాక మల్ల గుల్లాలు పడుతున్నారు. జనం అంతరంగం తెలుసుకొనేందుకు రూ.లక్షలు వెచ్చించి చేయించిన సర్వేల్లోనూ ఓటరు నాడి అంతుబట్టక అయోమయంలో పడ్డారు. మరోసారి సర్వేలతో తమ బలం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయంపై ఎవరికి వారే ధీమాగా కనిపిస్తున్నా లోలోపల ఓటర్ల మనసు గుర్తించలేక మథనపడుతున్నారు.
Survey On Telangana Assembly 2023 Elections : ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో అనే ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొందరు అభ్యర్థులు ప్రముఖ సంస్థలతో సర్వేలు చేయిస్తున్నారు. తెలంగాణలో కొన్ని సర్వే సంస్థలు సర్వే చేయగా 100లో 25 మంది ప్రజలు మాత్రమే తాము ఏ పార్టీ అభ్యర్థికి మద్ధతు పలుకుతామనేది వెల్లడించారు. శేరిలింగంపల్లిలో ఒక సర్వే సంస్థ తరఫున కొందరు విద్యార్థులు రెండు కాలనీల్లో సర్వేకు వెళ్లారు. సుమారు 200మంది నుంచి అభిప్రాయం సేకరించారు. వారిలో సగం మంది మాత్రమే తాము ఏ పార్టీ/అభ్యర్థికి మద్దతు ఇస్తామనేది తెలిపారు. మిగిలిన వారంతా ‘అప్పుడు చూద్దా’మంటూ బదులిచ్చారంటూ సర్వేలో పాల్గొన్న ఒక విద్యార్థి తెలిపారు.
KTR Interesting Comments on TSPSC : 'డిసెంబరు 3 తర్వాత TSPSC ప్రక్షాళన.. నాదే బాధ్యత'
ఖైరతాబాద్ నియోజకవర్గంలోనూ ప్రధాన పార్టీకి చెందిన ఒక అభ్యర్థి మూడు నెలల్లో రెండు సర్వేలుచేయించారు. మొదటిసారి గెలుపు వరిస్తుందని, రెండోసారి నియోజకవర్గంలో ఓటమి తప్పదంటూ వేర్వేరు నివేదికలు రావటంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో మూడోసారి సర్వే కోసం పొరుగు రాష్ట్రానికి చెందిన మీడియా సంస్థకు బాధ్యత అప్పగించినట్టు సమాచారం. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే.