Telangana Election Result 2023 Live :అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో పోటీలో అభ్యర్థులగెలుపోటములపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. అభ్యర్థుల భవిత్యం ఈవీఎంలలో దాగి ఉండడంతో గెలుపు అవకాశాలపై జోరుగా బెట్టింగ్ సాగుతుంది. ప్రధానంగా పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో రూ.లక్షల్లో బెట్టింగులకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బుకీలు లేకపోయినప్పటికీ స్థానికంగా బెట్టింగులు కాస్తున్నారు. గ్రామాల్లో కొందరు ఆ పందేలకు తెరతీసినట్లు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లో రూ.500 నుంచి రూ.2వేల మధ్య ఓట్లతో గెలిచే అవకాశాలు ఉండటంతో అభ్యర్థుల గెలుపుపై బెట్టింగ్ వేసినవారికి ఉత్కంఠ నెలకొంది.
Betting in Telangana Election 2023 : రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించిన కొడంగల్‌పై బెట్టింగ్ జోరుగా కొనసాగుతోంది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్, వనపర్తి నియోజకవర్గాల్లోనూ స్థానికులు కొందరు లక్షల్లో బెట్టింగులు కాస్తున్నారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో పందాలు కాస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నియోజకవర్గాల్లో రూ.50వేల వరకు గెలుపుపై పందాలు కాస్తున్నారు.
Betting On Telangana Elections in AP : పక్క రాష్ట్రానికి చెందినవారు ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జడ్చర్ల, దేవరకద్ర, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో రెండు ముఖ్య పార్టీల మధ్య పోరు నడుస్తోంది. ఇక్కడ తక్కువ ఓట్లతో ఏ పార్టీ అభ్యర్థి అయినా గెలవచ్చన్న ప్రచారం జరుగుతుండటంతో పలువురు ఈ నియోజకవర్గాలపై పందేలకు ఎక్కువగా పాల్పడుతున్నారు.
ఈ నియోజకవర్గాల్లో రూ.10వేల నుంచి లక్ష వరకు బెట్టింగ్ ధర పలుకుతోంది. క్రికెట్ బెట్టింగ్‌లకు తలపించేలా ఎన్నికల పందాలు సాగుతోంది. క్రికెట్ బెట్టింగ్‌ల్లో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తులే ఇలాంటి వాటికి పాల్పడుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ అడ్డాలనే దీనికి వాడుతున్నారు.