తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth Reddy, Telangana Election Result Live 2023 : రేవంత్​ రెడ్డిని మార్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ డీజీపీ - తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023

Revanth Reddy, Telangana Election Result Live 2023 : తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు దిశగా సాగుతోంది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్​ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం రేవంత్ ​రెడ్డి భారీ ర్యాలీతో గాంధీ భవన్​కు బయలు దేరారు.

Telangana DGP Meets Revanth Reddy
Revanth Reddy, Telangana Election Result Live 2023

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2023, 1:39 PM IST

Revanth Reddy, Telangana Election Result Live 2023 : తెలంగాణలో కాంగ్రెస్​ గెలుపు దిశగా సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు గెలుపు సంబురాలు షురూ చేశారు. పూర్తి ఎన్నికల ఫలితాలు వెలువడకముందే కాంగ్రెస్​దే విజయమని రాష్ట్ర మంతా జనాలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఛీఫ్ రేవంత్​ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంచారు.

Revanth Reddy, Telangana Election Result Live 2023 రేవంత్​ రెడ్డిని మార్యాద పూర్వకంగ కలిసిన తెలంగాణ డీజీపీ

కాంగ్రెస్ గెలుపు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. అంజనీ కుమార్​తో పాటు సీఐడీ ఛీఫ్​ మహేశ్ భగవత్​, అదనపు డీజీ సంజయ్​ కుమార్​ జైన్ వెళ్లారు. అనంతరం రేవంత్​ రెడ్డి భారీ ర్యాలీతో గాంధీ భవన్​కు బయలుదేరారు. ర్యాలీలో కాంగ్రెస్​ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details