Telangana Election Campaign in Social Media : ఎన్నికలేవైనా.. నాయకులు, కార్యకర్తల ప్రచారాలకు దీటైన వేదికలు సామాజిక మాధ్యమాలు. ఎన్నికల సమాచారాన్ని తెలిపేందుకే కాగా.. పార్టీల గెలుపోటముల్ని నిర్దేశించేస్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే.. అన్ని పార్టీలు సామాజిక మాధ్యమాల ప్రచారానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. వ్యంగ్యాస్త్రాలు, ఛలోక్తులు, నాయకుల పొరపాట్లు, గ్రాఫిక్స్ ఫొటోలు, వ్యాఖ్యానాలను పోస్టుల రూపంలో మొబైల్ ఫోన్లు నింపేస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో వేలాది గ్రూపులను ఏర్పాటు చేసి.. పార్టీల వార్తలతో హోరెత్తిస్తున్నారు. అన్నీ పార్టీల ముఖ్య నాయకులు.. నిత్యం సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంటున్నారు. కార్యకర్తలూ వారి దారిలోనే.. పార్టీ విధానాల్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు.
ఆన్లైన్ ప్రచారంలో నేతలు- ఎన్నికల వ్యాపారం డీలా, గిరాకీ లేక దుకాణాలు వెలవెల!
Telangana Leaders Campaign In Social Media : పత్రికలు, టీవీలతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రకటనలు ఇస్తున్నాయి. ప్రభుత్వం ఏం పనులు చేసింది..? ఇంకేం చేయబోతుందో అధికార పార్టీ వివరిస్తోంది. సర్కారు వైఫల్యాలపై విపక్షాలు ప్రకటనలు గుప్పిస్తున్నాయి. సామాజిక మాధ్యమసంస్థలు సైతం.. కృతిమ మేధ ద్వారా ప్రకటనల్ని ఓటర్లకు చేరుస్తున్నాయి. అన్ని పార్టీలకూ సామాజిక ప్రచార విభాగాలు పనిచేస్తుండగా.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మరింత బలోపేతం చేశారు. బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీలు సామాజిక మాధ్యమాల వినియోగాన్ని విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి.
Telangana Assembly Elections 2023: ప్రత్యర్థి పార్టీల వైఖరి, వైఫల్యాలతో పాటు మేనిఫెస్టోలను ఆకట్టుకునేలా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. సందేశాలు, ప్రత్యేక గీతాలు, ఆకట్టుకునే ఫోటోలు, వీడియోలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తంగా.. అందరి లక్ష్యం తటస్థ ఓటర్లే.. ఏ పార్టీలకు సంబంధం లేకుండా స్థిరంగా ఉండే వాళ్లని ఎవరు తమ వైపునకు తిప్పుకుంటే వాళ్లదే విజయం. అందుకే.. అన్నీ పార్టీలకు ఇప్పుడు తటస్థులను ఆకర్షించడం పనిగా మారింది. ఇందుకు ప్రత్యర్థుల తప్పొప్పులను వివరించడం, తాము గెలిస్తే.. చేయబోయే పనుల ప్రణాళికలను సోషల్ మీడియా ద్వారా వివరిస్తున్నారు.