Telangana Election Campaign in Social Media :రాష్ట్రంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. డిజిటల్ యుగంలో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకేళ్లేందుకు అధికార పార్టీ బీఆర్ఎస్ కృషి చేస్తుంటే.. పదేళ్ల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అన్ని పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి.
Telangana Leaders Campaign In Social Media : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం హోరందుకుంది. ఒక వైపు అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకలు.. అన్ని నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్తుంటే.. మరో వైపు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచార జోరు పెరిగింది. పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా రాజకీయాలకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందకు మెుగ్గు చూపుతున్నారు.
KTR on Trolls: సోషల్‌మీడియా ట్రోల్స్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్..
రోజు రోజు ఎన్నికల ప్రచార సరళి పూర్తిగా మారుపోతుంది. ఒక్కప్పుడు ఎన్నికల అంటే.. భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, ఫ్లెక్సీలు, కరపత్రాలు, పోస్టర్లతో నాయకులు, కార్యకర్తలు హడావిడి చేసేవారు. ఇంటింటా తిరుగుతూ.. తమకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలను వేడుకునేవారు. ప్రస్తుతం అలాంటి సంప్రదాయాలు కనుమరుగయ్యాయి. అందరికీ అందుబాటులో ఉండే వాట్సాప్, ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా.. నేతలు ఎన్నికల ప్రచారాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్తున్నారు.