Telangana Election Campaign in Full Swing : సంక్షేమ, ప్రగతి పాలన కొనసాగాలంటే మరోసారి భారత రాష్ట్ర సమితికే పట్టం కట్టాలని గులాబీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. తొమ్మిదినరేళ్ల ప్రగతిని వివరిస్తూనే కేసీఆర్ భరోసాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా మంత్రి హరీశ్‌రావు మహిళా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముషీరాబాద్, అంబర్పేట అభ్యర్థులకు మద్దతుగా మంత్రి తలసాని(Minister Talasani Srinivas) ప్రచారం నిర్వహించగా మహిళలు ఘన స్వాగతం పలికారు.
BRS Josh Election Campaign :అల్లాపూర్ డివిజన్‌లోని పలు కాలనీల అసోసియేషన్ సభ్యులతో కూకట్‌పల్లి అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. కార్వాన్ నియోజకవర్గంలోని టోలిచౌకి, నిజాం మిలటరీ క్వార్టర్స్ తదితర ప్రాంతాలలో పాదయాత్ర(BJP Hike) నిర్వహించిన కౌసర్ మొయినుద్దీన్ మరోసారి ఎంఐఎమ్(MIM Party) ఓటు వేయాలని ప్రజలను కోరారు. బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు గ్రామాల బీజేపీ నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు.
'గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చాం- గిరిజనులు కానివారికీ త్వరలో పట్టాలు ఇస్తాం'
ప్రచారాల్లో నిరసన సెగ..:మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఇల్లెందు అభ్యర్థి హరిప్రియా నాయక్‌కు నిరసన సెగ తగిలింది. గతంలో ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు(Welfare Schemes) అందించ లేదంటూ గౌరారం గ్రామస్థులు నల్లజెండాలు ప్రదర్శించారు. హనుమకొండ జిల్లా దామెర మండలంలో ప్రచారం నిర్వహించిన చల్లా ధర్మారెడ్డి కారు గుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో పలు తండాల్లో ప్రచారం నిర్వహించిన గాదరి కిషోర్ కుమార్‌కు గజమాలతో సత్కరించారు. భుజాలపై ఎక్కించుకొని తిప్పిన అభిమానులు గెలుపును సైతం భుజాలపై వేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
Innovative Campaigns to Impress Voters : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో(Municipality Campaign) నల్లమోతు భాస్కర్ రావు ప్రచార జోరు పెంచారు. మధిర అభ్యర్థి లింగాల కమలరాజు యడవల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ఆరంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట నియోజకవర్గంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మెచ్చ నాగేశ్వరరావు విస్తృత ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.
Congress Party Election Campaign With Six Guarantees :ఆరు గ్యారంటీల అస్త్రంతో కాంగ్రెస్‌నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికార గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగటంతో గ్రామాల్లోని ఇతర పార్టీల కార్యకర్తలు హస్తం గూటికి చేరుతున్నారు. సంగారెడ్జి జిల్లా జహీరాబాద్‌లో ఏ చంద్రశేఖర్ ప్రచార రథంపై(Campaign Chariot) తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞుప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డితో పాటు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మీడియా సమావేశంలో బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు.