అధికారమే లక్ష్యంగా ప్రచారాల జోరు- విమర్శలతో రసవత్తరంగా మారుతున్న రాజకీయం Telangana Election Campaign 2023: హైదరాబాద్ సనత్‌నగర్ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రోడ్ షో ద్వారా ప్రచారం చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ ఎన్నికల ప్రచారం(Election Campaign) నిర్వహించారు. పదేళ్ల అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని సూచించారు. నల్గొండ జిల్లా మునుగోడులో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చండూర్ మండలంలోని పలుగ్రామాల్లో ప్రచారం చేశారు.
BRS Election Campaign 2023 : మెదక్‌లో అధికార పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్తులు బతుకమ్మ, బోనాలతో, డప్పు చప్పులతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. హనుమకొండ జిల్లా పరకాలలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పలు కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రోడ్‌షోలో పాల్గొన్నారు. మరోసారి బీఆర్ఎస్(BRS)ను గెలిపిస్తే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని వెల్లడించారు.
"కఠినమైన పరిస్థితుల్లో తెలంగాణను సాధించుకున్నాం. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. బీఆర్ఎస్ను మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. పింఛన్లు క్రమంగా పెంచుతాం."- కవిత, ఎమ్మెల్సీ
సమయం దగ్గరకు వస్తోంది- నాయకుల్లో జోరు పెరిగింది, పోటా పోటీగా ప్రచారం చేస్తున్న నేతలు
Congress Election Campaign in Telangana 2023 : కాంగ్రెస్ అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడంతో ప్రచారానికి గడువు పెద్దగా లభించలేదు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి బండి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. కోరుట్లలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేద ప్రజలను ఆదుకోవడానికే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను(Congress Six Guarantees) తీసుకొచ్చిందని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జై వీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి , ఆయన సతీమణి, కుమార్తె ప్రచారంలో పాల్గొన్నారు. జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తెలంగాణలో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం - తమ అభ్యర్థికే ఓటు వేయాలంటున్న స్టార్ క్యాంపెయినర్లు
Telangana BJP Election Campaign 2023: నిజామాబాద్ జిల్లా బోధన్ బీజేపీ అభ్యర్థి వడ్డి మోహన్ రెడ్డి నవీపేట్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని పలుగ్రామాల్లో బీజేపీ అభ్యర్థి అజ్మీర ప్రహ్లాద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గజ్వేల్ బీజేపీ(BJP Campaign) అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని ఈటల తెలిపారు.
తెలంగాణతో బీఆర్‌ఎస్‌కు ఉన్నది పేగు బంధం : ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న స్టార్ క్యాంపెయినర్లు - అభ్యర్థులకు ఎంతవరకు కలిసొచ్చేనో?