Telangana Election Campaign 2023 :నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు రాజకీయ పార్టీల నేతలు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. అయితే గతంలో ప్రచార బాధ్యతలను(Election Campaign) ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు అప్పగించేవారు. ఈసారి డివిజన్‌కు ఒక కొత్త బాధ్యుడిని నియమించి.. పనులు మొత్తం వారికే ఇస్తున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల ఎటువంటి ప్రమేయం లేకుండా ప్రచారం మొత్తాన్ని పర్యవేక్షిస్తూ అభ్యర్థితో నేరుగా సమన్వయం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
వీరి పని ఏమిటంటే ప్రజా నాడి పసిగట్టడం, ప్రచార తీరుతెన్నులను పరిశీలిస్తూ అవసరమైతే మార్పులు సూచించడం. ప్రచారానికి అయ్యే ఖర్చు, ఏ మేర ఓటర్లు ప్రభావితం అవుతున్నారో రోజూ నివేదిక సమర్పించడం. అభ్యర్థులతో నేరుగా సమన్వయం చేసుకుంటుండటంతో కార్యకర్తలంతా వారి చుట్టూ తిరుగుతున్నారు. అయితే డివిజన్లలో కీలకంగా ఉండే నేతలు అసంతృప్తిగా ఉన్నారు.
యాప్‌ల వినియోగం : ఓటర్ల జాబితా పరిశీలన.. తమ వైపు మొగ్గే ఓటర్లను గుర్తించి.. వారిని పోలింగ్ బూత్ వరకు రప్పించడం తదితరాలపై ప్రస్తుతం వీరంతా పనిచేస్తున్నారు. కొందరు నాయకులు ప్రత్యేకంగా యాప్‌లు రూపొందించుకుని తమ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితా(Voter List) వివరాలను అందులో నిక్షిప్తం చేశారు. రోజూ వంద మంది ఓటర్లతో మాట్లాడటం, వారి మనోగతం గురించి తెలుసుకుంటూ ప్రచారంలో మార్పులు చేయడంపై దృష్టి సారించారు. ఇలా సేకరించిన సమాచారాన్ని అభ్యర్థితో నేరుగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.
ఓటరన్నా ఈసారి నీ ఓటు రేటెంతా - నీ లీడర్ ఇచ్చే చీప్‌లిక్కర్ రేటంతేనా?