హైదరాబాద్లో తెలంగాణ విద్యుత్ ఇంజినీర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో విద్యుత్ ముస్లిం ఉద్యోగులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విద్యుత్ సంస్థలోని ముస్లిం ఉద్యోగులకు ఇఫ్తార్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని టీఎస్‌స్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అన్నారు. ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరుల కుటుంబాలకు విద్యుత్ సంస్థ తరఫున ఆర్థిక సహాయం అందిస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది కూడా ముగ్గురు అమరుల కుటుంబాలకు... ఒక్కో కుటుంబానికి 50వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు అసోషియేషన్ సభ్యులు పేర్కొన్నారు.
కేసీఆర్ సర్వమతాభిమాని: విద్యుత్ శాఖ ఉద్యోగులు - Telangana electicity-employee-ifthar
తెలంగాణ విద్యుత్ ఇంజినీర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో విద్యుత్ ముస్లిం ఉద్యోగులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ఆవిర్భావం రోజున అమరుల ఒక్కో కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు టీఎస్‌స్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి వెల్లడించారు.

కేసీఆర్ సర్వమతాభిమాని: విద్యుత్ శాఖ ఉద్యోగులు