విద్యాశాఖలో అదనపు, సంయుక్త సంచాకులుగా పదోన్నతులు పొందిన అధికారులకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. మరి కొందరిని బదిలీ చేస్తూ విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. సమన్వయం, సర్వీసు అంశాల అదనపు డైరెక్టర్గా కె.లింగయ్య నియమితులయ్యారు. సమగ్ర శిక్ష అదనపు సంచాలకుడిగా రమేష్, పాఠ్య పుస్తకాల విభాగం అదనపు సంచాలకుడిగా శ్రీనివాస చారి, మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్గా ఉషారాణి, వయోజన విద్య సంచాలకురాలిగా విజయలక్ష్మి బాయిని నియమించారు.
విద్యాశాఖలో పలువురు ఉద్యోగుల ట్రాన్స్ఫర్ - Transfer of several employees in Education Department
రాష్ట్ర విద్యాశాఖలో అదనపు, సంయుక్త డైరెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. ఈ మేరకు పలువురిని బదిలీ చేస్తూ విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్సీఈటీ సంచాలకురాలిగా రాధా రెడ్డి, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడిగా సత్యనారాయణ రెడ్డి, గురుకుల సోసైటీ కార్యదర్శిగా రమణ కుమార్ నియమితులయ్యారు. వరంగల్ ఆర్జేడీగా కె.సత్యనారాయణ రెడ్డి, హైదరాబాద్ ఆర్జేడీగా ఇ. విజయలక్ష్మీ, సర్వీసు అంశాల జేడీగా మదన్ మోహన్, మోడల్ స్కూల్స్ జేడీగా సరోజిని దేవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు అకాడమీ డైరెక్టర్గా సోమిరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇదీ చూడండి :'తన సినిమాను యూట్యూబ్లో అప్లోడ్ చేశారని కేసు'