జులై 7, 8, 9 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు
16:29 March 06
జులై 7, 8, 9 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు
తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ షెడ్యూల్ ఖారారైంది. ఈ నెల 18వ తేదీన ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఎంసెట్ కమిటీ వెల్లడించింది. ఈ నెల 20 నుంచి మే 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఆలస్య రుసుంతో జూన్ 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని వెల్లడించింది.
జులై 5 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇప్పటికే ప్రకటించింది. జులై 5, 6 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు జరగనున్నాయి. జులై 7, 8, 9 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నట్లు కమిటీ వెల్లడించింది. అయితే ఇంటర్ మొదటి సంవత్సరంలో వంద శాతం, ద్వితీయ సంవత్సరంలో 70 శాతం సిలబస్‌నే ఎంసెట్‌లో ఇవ్వాలని ఇప్పటికే కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది కూడా జేఎన్‌టీయూహెచ్ రెక్టార్ గోవర్దన్ పరీక్షల కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.
ఇదీ చదవండి:ఆర్ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు.. రూ.65లక్షలు స్వాధీనం