తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 9 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ల నమోదుకు అధికారులు అవకాశం ఇచ్చారు. 12 నుంచి 18 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించనున్నారు. 12 నుంచి 20 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది. 22న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లు కేటాయించనున్నారు.
రేపే ఇంజినీరింగ్ ఎంసెట్ ఫలితాలు.. కౌన్సెలింగ్ షెడ్యూలు ఖరారు - ts eamcet counselling
17:39 October 05
ఈనెల 9 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్లు
29న తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జరగనుంది. 30న తుది విడత ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. 30,31 తేదీల్లో తుది విడత ఎంసెట్ వెబ్ఆప్షన్లు ఎంచుకోవచ్చు. నవంబరు 2న ఇంజినీరింగ్ తుది విడత సీట్లు కేటాయించనున్నారు. 4న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను అధికారులు విడుదల చేయనున్నారు. లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది ఎంసెట్ నిర్వహణ ఆలస్యమైంది.
మంగళవారం ఇంజినీరింగ్ ఫలితాలు
మంగళవారం ఇంజినీరింగ్ ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు జేఎన్‌టీయూలో ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు.