TS EAMset 2023 Notification Release: ఎంసెట్ 2023 షెడ్యూలు నోటిఫికేషన్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల చేయడానికి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఎంసెట్ ఆన్లైన్ అఫ్లికేషన్లను మార్చి 3 నుంచి స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 10వగా ఉంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత అందులో మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఏప్రిల్ 12 నుంచి 14 వరకు ఛాన్స్ ఇవ్వనున్నారు.
అపరాధ రుసుం: రూ.250 అపరాధ రుసుముతో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 15గా ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. రూ.500లతో అపరాధ రుసుముతో ఏప్రిల్ 20వరకు గడువు పెంచనున్నారు. రూ.2500లతో అపరాధ రుసుముతో ఏప్రిల్ 25వరకు గడువు ఇవ్వనున్నారు. 30వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించనుంది.
మే 7 నుంచి 11వ తేదీ వరకు ఎంసెట్ పరీక్ష జరగనుంది. ఇంజినీరింగ్ విభాగ ప్రవేశ పరీక్షలలో మొదటి పరీక్ష మే 7 మధ్యాహ్నం జరగనుంది. అలాగే మే 8,9వ తేదీల్లో రెండు పూటల ఈ విభాగానికి సంబంధించిన పరీక్షను జరపునున్నారు. అలాగే అగ్రికల్చర్ & మెడిసిన్ విభాగాల ప్రవేశ పరీక్షలో మే 10, 11న రెండు పూటల ఆయా సబ్జెట్‌లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది.
పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల:ఈనెల 28న పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల కానుందని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. మార్చి 3 నుంచి ఏప్రిల్ 30 వరకు పీజీఈసెట్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆలస్య రుసుములతో మే 24 వరకు పీజీఈసెట్ దరఖాస్తుల ఆహ్వానిస్తారు. మే21 నుంచి పీజీఈసెట్ హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నారు. మే 29 నుంచి జూన్1 వరకు పీజీఈసెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: