How to Check Double Bedroom Application Online : తెలంగాణ సర్కార్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం 2015 అక్టోబరులో రెండు పడక గదుల పథకాన్ని ప్రారంభించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నివాస సదుపాయాలు లేని పేద ప్రజలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి.. వారి సొంతింటి కల సాకారం చేయడమే ఈ పథకం లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం(Double Bedroom Scheme)తో పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేకూరుతోంది.
Telangana 2BHK Application Status in Online :ఎన్నికలు(Telangana Assembly Elections 2023) సమీపిస్తున్న వేళ సర్కార్ డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీని వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించి.. అర్హులైన వారికి పంపిణీ షురూ చేసింది. అయితే ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం భారీ మొత్తంలో దరఖాస్తులు పోటెత్తాయి. అయితే మీరు ఈ పథకానికి అప్లై చేసి.. మీకు వస్తుందా? లేదా అని వెయిట్ చేస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ అర్హతలు కలిగి ఉండి మీరు అప్లై చేస్తే.. ఇప్పుడే మీ డబుల్ బెడ్ రూం అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకొని మీకు వచ్చిందో లేదో సింపుల్‌గా ఆన్లైన్లో ఇలా తెలుసుకోండి..
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందాలంటే ఉండాల్సిన అర్హతలివే..
Double Bedroom Scheme Eligibility Criteria :
- లబ్ధిదారుడు తప్పనిసరిగా రేషన్ కార్డు/ ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలి.
- ఈ స్కీమ్‌కు అప్లై చేసుకునే వారు ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన వారై ఉండాలి.
- అలాగే సొంత ఇల్లు లేని, అద్దె ఇంట్లో నివసిస్తున్న కుటుంబాలు ఈ స్కీమ్‌కు అర్హులు.
- ఈ పథకంలో శారీరక వికలాంగులకు 5% రిజర్వేషన్ కేటాయించారు.
- అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే SC, STలకు 50%.. ఇతరులకు 43%.. మైనారిటీలకు 7% కేటాయించారు.
- అలాగే పట్టణ ప్రాంతాల్లో నివసించే ఎస్సీలకు 17%, ఎస్టీలకు 6%, మైనార్టీలకు 12%, ఇతరులకు 65% కేటాయించారు.
- మరో విషయం ఏమిటంటే.. కుటుంబంలోని సభ్యులెవరూ ఇందిరా పథకం వంటి హౌసింగ్ స్కీమ్‌ల కింద ఇల్లు పొంది ఉండకూడదు.
పై అర్హతలు కలిగి ఉండి మీరు తెలంగాణ సర్కార్ అందిస్తున్న డబుల్ బెడ్ రూం పథకానికి అప్లై చేసుకున్నట్లయితే మీరు ఈ పథకం ద్వారా రెండు పడక గదుల ఇల్లు పొందారో లేదో ఇప్పుడే సులువుగా ఆన్లైన్లో 'డబుల్ బెడ్ రూం స్కీమ్' అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుని మీరు అర్హుల జాబితాలో ఉన్నారో లేదో తెలుసుకోండిలా..
How to Apply For Double Bedroom Scheme : తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్.. దరఖాస్తు ఎలా చేయాలో తెలుసా?