తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉత్తమ ఐపీఎస్‌ల జాబితాలో తెలంగాణ పోలీస్​బాస్​ - DGP Mahender Reddy Latest News

దేశంలోని అత్యుత్తమ ఐపీఎస్‌ అధికారుల జాబితాలో డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డికి చోటు దక్కింది. 4 వేల మందిలో చివరికి ఎంపిక చేసిన 25 మందిలో డీజీపీ స్థానం పొందారు.

ఉత్తమ ఐపీఎస్‌ల జాబితాలో తెలంగాణ పోలీస్​బాస్​
ఉత్తమ ఐపీఎస్‌ల జాబితాలో తెలంగాణ పోలీస్​బాస్​

By

Published : Apr 8, 2020, 7:17 AM IST

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తమ ఐపీఎస్​ జాబితాలో స్థానం సంపాదించారు. ఫేమ్‌ ఇండియా, ఏసియా పోస్ట్‌, పీఎస్‌యూ వాచ్‌ సంస్థలు నిర్వహించిన సర్వేలో భాగంగా తొలుత దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 4వేల మంది ఐపీఎస్‌లను గుర్తించారు. వారిలో ఉత్తమ పనితీరును కనబర్చిన 200 మందిని వడబోసి చివరగా 25 మందిని ఎంపిక చేశారు.

నక్సలిజం, ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల్ని సమర్థంగా అణిచివేయడం అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నారు. నేరాల్ని నియంత్రించడంలో సామర్థ్యం, శాంతిభద్రతల్ని కాపాడటంలో పనితీరు, ప్రజామిత్ర పోలీసింగ్‌, సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో నేర్పు లాంటి అంశాలకు పెద్దపీట వేసినట్లు పీఎస్‌యూ వాచ్‌ సంస్థ సంచాలకుడు వివేక్‌శుక్లా తెలిపారు.

ఇదీ చూడండి:కరోనా కోసమని ఆ మాత్ర వాడితే చూపు తగ్గుతుంది!

ABOUT THE AUTHOR

...view details