అక్రమ కేసులు బనాయించి... నిర్బంధించిన రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో పలువురు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. 79 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావు, 90 శాతం అంగవైకల్యంతో కదలలేని స్థితిలో ఉన్న ప్రొ.సాయిబాబాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
'వరవరరావు, సాయిబాబాను విడుదల చేయాలి' - వరవరరావు, సాయిబాబాను విడుదల చేయాలి
వరవరరావు, సాయిబాబాతో పాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాలలో నిర్బంధించిన రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయలని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.

వరవరరావు, సాయిబాబాను విడుదల చేయాలి
తెలుగు రాష్ట్రాలలో దాదాపు 350 ప్రాంతాలలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులతో పాటు కవులు, చిక్కుడు ప్రభాకర్, జైను మల్లయ్య గుప్తా, సంధ్య, పోతు రంగారావు, చెరుకు సుధాకర్, పి.ఎల్ విశ్వేశ్వరరావు పలుపురు ఈ దీక్షలకు నాయకత్వం వహించారు.
ఇదీ చూడండి:మంత్రి జగదీశ్‌రెడ్డి వర్సెస్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి