Telangana Decade Celebrations to day special Welfare Day : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ దినాన్ని హైదరాబాద్ సహా జిల్లాల్లో అట్టహాసంగా జరిపారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు దళిత బంధు, రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లను ఇస్తున్న ఘనత కేసీఆర్ దేనని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ అంబర్‌పేటలో నిర్వహించిన గిరిజనాభివృద్ధి ప్రగతి నివేదిక సంబరాల్లో పాల్గొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు కోటి రూపాయల చెక్కులు, కులవృత్తుల వారికి లక్ష సాయం అందజేశారు.
వరంగల్ రాయపర్తి మండలం క్రిష్టాపురం వద్ద కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ లక్ష్యంగా మంత్రి ఎర్రబెల్లి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ది దిశగా ముందుకు సాగుతున్న క్రమంలో ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి జూనియర్ కళాశాల మైదానం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేశారు. కులవృత్తుల దారులకు లక్ష రూపాయల నగదు పంపిణీ చేశారు.
Second phase sheep distribution program in Telangana : 143 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు ఎమ్మెల్యే సొంతంగా చీరలను బహుకరించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు. ఖమ్మంలో సంక్షేమ సంబురాల్లో పాల్గొన్న మంత్రి బీసీ లబ్ధిదారులకు లక్ష రూపాయల నగదు సాయాన్ని అందజేశారు. అంబేడ్కర్ ఆశయస్ఫూర్తితో పేద వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.