తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Decade Celebrations : పదేళ్ల ప్రగతిని చాటేలా.. అమరుల త్యాగాలను స్మరించుకునేలా.. - తెలంగాణ అవతరణ దినోత్సవం 2023

Telangana Decade Celebrations 2023 : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పదేళ్ల రాష్ట్ర ప్రగతి ప్రస్థానంతో పాటు అమరుల త్యాగాలను స్మరించుకునేలా జరుపుతామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఉత్సవాలను జరపడం కాంగ్రెస్‌, బీజేపీకి మింగుడుపడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ జరపమంటూ వేడుకలను తక్కువ చేస్తోందని.. విభజన హామీలు నెరవేర్చని బీజేపీ ప్రత్యేకంగా సంబురాలు చేయడం ఏంటని హరీశ్‌రావు ప్రశ్నించారు.

Telangana Decade Celebrations
Telangana Decade Celebrations

By

Published : May 29, 2023, 8:00 AM IST

పదేళ్ల ప్రగతిని చాటేలా.. అమరుల త్యాగాలను స్మరించుకునేలా..

Telangana Decade Celebrations 2023 : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సావాలను అత్యంత వైభవంగా జరిపేందుకు.. ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళుతోంది. జిల్లాల వారీగా వేడుకలను ఘనంగా నిర్వహించేలా.. మంత్రులు యంత్రాంగానికి దిశా నిర్దేశం చేస్తున్నారు. మెదక్‌ కలెక్టరేట్‌లో దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, కార్యక్రమాల అమలుపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రి హరీశ్‌ రావు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తొమ్మిదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా 21 రోజుల పాటు కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.

Telangana Formation Day 2023 :రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిర్వహించబోమంటూ కాంగ్రెస్‌ వేడుకలను తక్కువ చేసి చూపిస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇది అమరుల త్యాగాలను అవమానించడమే అవుతుందని ఆక్షేపించారు. విభజన హామీలను నెరవేర్చని బీజేపీ ప్రత్యేకంగా అవతరణ సంబురాలు జరుపుతామని ప్రకటించడం ఏంటని హరీశ్‌ రావు ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులను కాలరాస్తున్న కేంద్రం.. ఏ మొహం పెట్టుకుని వేడుకలు చేస్తుందని విమర్శించారు. ఈ క్రమంలోనే నూతన పార్లమెంట్‌కు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

''రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిర్వహించబోమంటూ కాంగ్రెస్‌ వేడుకలను తక్కువ చేసి చూపిస్తోంది. ఇది అమరుల త్యాగాలను, తెలంగాణ ప్రజలను అవమానించడమే అవుతుంది. విభజన హామీలను నెరవేర్చని బీజేపీ ప్రత్యేకంగా అవతరణ సంబురాలు జరుపుతామని ప్రకటించడం ఏంటి. రాష్ట్ర హక్కులను కాలరాస్తున్న కేంద్రం.. ఏ మొహం పెట్టుకుని వేడుకలు చేస్తుంది. నూతన పార్లమెంట్‌కు అంబేడ్కర్‌ పేరు పెట్టాలి.'' - మంత్రి హరీశ్‌రావు

పది కాలాలు గుర్తుండేలా వేడుకల నిర్వహణ.. : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పది కాలాలు గుర్తుండేలా నిర్వహిస్తామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. వరంగల్‌లో దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, కార్యచరణపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, శాసన మండలి వైస్ ఛైర్మన్ బండా ప్రకాశ్‌, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, సీపీ ఏవీ రంగనాథ్, హనుమకొండ జిల్లా కలెక్టర్, వరంగల్ జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను భాగస్వామ్యం చేసేలా కార్యక్రమాలు రూపకల్పన చేయాలని యంత్రాంగాన్ని ఎర్రబెల్లి ఆదేశించారు.

రోజుకో ప్రభుత్వ శాఖ ప్రగతిని ఆవిష్కరించాలి.. : నిజామాబాద్‌లో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి అద్దం పట్టేలా కార్యక్రమాల రూపకల్పనతో పాటు రోజుకో ప్రభుత్వ శాఖ ప్రగతిని ఆవిష్కరించాలని మంత్రి సంబంధిత అధికారులకు సూచించారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details