తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Decade Celebration 2023 : ఘనంగా ముగిసిన రాష్ట్ర దశాబ్ది వేడుకలు

Telangana Decade Celebrations Conclusion : దశాబ్ది ఉత్సవాలు సుసంపన్నం అయ్యాయి. మూడు వారాలుగా సాగిన రాష్ట్ర అవతరణ సంబురాల్లో తుదిఅంకం అమరుల సంస్మరణ ఉద్వేగంగా సాగింది. హైదరాబాద్ నడిబొడ్డున అమరుల స్మారకం, అమరజ్యోతిని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఆరేడు వందల అమరుల కుటుంబాలకు తోడ్పాటు ఇచ్చామని..ఇంకా ఎవరైనా ఉంటే ఉదారంగా సాయం చేస్తామని ప్రకటించారు. స్వల్పకాలంలోనే ప్రగతికాముక రాష్ట్రంగా అవతరించామన్న ముఖ్యమంత్రి అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ... ఇదే స్ఫూర్తితో ముందుకు పోతుందని హామీ ఇచ్చారు.

KCR
KCR

By

Published : Jun 23, 2023, 7:05 AM IST

ఘనంగా ముగిసిన రాష్ట్ర దశాబ్జి వేడుకలు

Telangana Decade Celebrations Ended :స్వరాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తయి పదో వసంతంలోకి అడుగిడిన వేళ తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని చాటేలా జూన్ రెండు నుంచి మూడు వారాల పాటు జరిగిన వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన అమరులకు అంజలి ఘటించేలా అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఊరూరా శ్రద్ధాంజలి, సంస్మరణ తీర్మానాలు చేయగా... రాజధాని హైదరాబాద్‌లో తుది కార్యక్రమం ఘనంగా జరిగింది.

Telangana Decade Celebrations 2023 :అమరుల గౌరవార్థం వేలాది మంది కళాకారులతో ఎన్​టీఆర్​ మార్గ్‌లో భారీ ర్యాలీ అనంతరం తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్... అమర జ్యోతిని వెలిగించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ... రాష్ట్ర సాధనా క్రమాన్ని పొందుపరుస్తూ రూపొందించిన డాక్యుమెంటరీని సీఎం సహా అందరూ వీక్షించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం సభా వేదిక వద్ద అందరూ విద్యుత్ దీపాలతో అమరవీరులకు నివాళుల‌ర్పించారు. అమ‌ర‌వీరుల కుటుంబాల‌ను స‌త్కరించారు. అమరులైన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్​ కిష్టయ్య, వేణుగోపాల్ రెడ్డి, యాదయ్య, యాదిరెడ్డి, సువర్ణ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు సన్మానించారు...

Inauguration Of Martyrs Memorial In Hyderabad : ఏళ్లలో సాగుతున్న అభివృద్ధి పాలనా క్రమాన్ని, సంఘటనలను గుర్తు చేసిన కేసీఆర్​ బలిదానాలు తనను ఎంతగానో బాధించాయని ఆవేదనను పంచుకున్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలుసంతోషాన్ని నింపగా... అమరుల త్యాగాలు వెంటాడుతూ దుఃఖాన్ని కలిగించే సందర్భంలో ఉన్నామని అన్నారు. అమరుల త్యాగాల స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నామన్న ఆయన... పదేళ్లకు చేరుకున్న రాష్ట్రాభివృద్ధిలో వారి త్యాగాల స్ఫూర్తి ప్రతిబింబిస్తున్నదని స్పష్టం చేశారు. ఆరేడు వందల అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు, ఆర్థికసాయం, ఇళ్లు ఇచ్చినట్లు తెలిపిన ముఖ్యమంత్రి...ఇంకా ఎవరైనా ఉంటే ఉదారంగా సాయం చేస్తామని ప్రకటించారు.

ఇతర రాష్ట్రాలవారు, విదేశీయులు ఎవరు వచ్చినా అమరుల జ్యోతికి పుష్పాంజలి ఘటించిన తర్వాతే మిగతా కార్యక్రమాలు జరిగేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ చరిత్రను కళ్లకు కట్టేలా ఫోటో గ్యాలరీ, తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చరిత్రను సమగ్రంగా పెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అద్భుతంగా పురోగమిస్తున్నామని, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నెంబర్​వన్‌గా ఎదిగామని గుర్తు చేశారు. ..

మూడు ప్రతిష్టాత్మక కట్టడాల నిర్మాణంతో హుస్సేన్ సాగర్ తీర ప్రాంతం ప్రత్యేకంగా మారిందని ముఖ్యమంత్రి చెప్పారు. సచివాలయం, స్మారకం మధ్యన భారీ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. సాగర తీరాన అద్భుతమైనడ్రోన్ షోతో ఉత్సవాలు దశాబ్దికాలం మదిలో గుర్తుండేలా కనులపండవగా ముగిశాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details