Telangana Debt in 2023 till March : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 2023 మార్చి నాటికి రూ.3లక్షల 66వేల 306 కోట్లకు చేరనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భాగవత్ కరాడ్ మంగళవారం రాజ్యసభలో తెలిపారు. 2018 మార్చి నాటికి రూ.1.60 లక్షల కోట్ల మేర ఉన్న రాష్ట్ర అప్పులు ఆరేళ్లలో 128% పెరిగినట్లు వెల్లడించారు. బడ్జెటేతర మార్గాల్లోనూ తెలంగాణ భారీస్థాయిలో రుణాలు తీసుకున్నట్లు ఆర్థికశాఖ మరో సహాయమంత్రి పంకజ్‌చౌదరి చెప్పారు.
discussion on Telangana Debt in Rajya Sabha : ఈ రూపంలో తెలంగాణ 2021-22లో రూ.35వేల 257.97 కోట్లు, 2022-23లో రూ.800 కోట్ల రుణం సేకరించి వాటికి సంబంధించిన అసలు, వడ్డీలను బడ్జెట్ నుంచి తిరిగి చెల్లిస్తున్నట్లు తెలిపారు. 2021-22లో దేశంలోని 28 రాష్ట్రాలన్నీ కలిపి రూ.66వేల 640.23 కోట్ల బడ్జెటేతర రుణాలు తీసుకోగా అందులో 52.90% వాటా తెలంగాణదే ఉన్నట్లు వెల్లడించారు.