Telangana Debts in 2022-23 Year : తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. అప్పులు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాల మొత్తం 20 వేల కోట్ల మార్కు దాటింది. గత వారం వరకే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ద్వారా రూ.19 వేల కోట్ల రూపాయలు సమీకరించుకొంది. తాజాగా మరో రెండు వేల కోట్ల రుణం తీసుకొంది.
ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ జారీ చేసిన బాండ్లను రిజర్వ్ బ్యాంక్(Reserve Bank of India) వేలం వేసింది. వెయ్యి కోట్ల రూపాయల విలువైన బాండ్లను తొమ్మిదేళ్ల కాలానికి, మరో వెయ్యి కోట్ల రూపాయల విలువైన బాండ్లను 18 ఏళ్ల కాలానికి జారీ చేశారు. ఆర్బీఐ ఇవాళ నిర్వహించిన వేలంలో 7.46 శాతం, 7.43 శాతం వడ్డీకి బాండ్లు అమ్ముడుపోయాయి. దీంతో అప్పుల రూపంలో మరో 2వేల కోట్లు ఖజానాకు చేరాయి. తాజా రుణంతో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు 21వేల కోట్ల రూపాయలకు చేరుకుంది.
CAG report on Telangana state taxes : రాష్ట్ర ఖజానాకు కాసుల పంట.. కాగ్ నివేదిక విడుదల
'మార్చి నాటికి రూ.3,18,918 కోట్లకు చేరిన అప్పు'
Central Govt on Telangana Debts 2023 : గత లోక్సభ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించిన దాని ప్రకారం.. తెలంగాణ ఏర్పడిన నాటికి రాష్ట్ర అప్పులు(Telangana Debts) రూ. 75వేల 577 కోట్లు ఉన్నాయి. 2021-22 నాటికి అవి రూ. 2క్షల 83వేల కోట్లకు చేరినట్లులోక్సభలో వెల్లడించారు. అంతే కాకుండా ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు ద్వారా లక్షా 50వేల కోట్లు అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు లక్షా 30వేల కోట్లని తెలిపారు. 2022 అక్టోబర్ నాటికి తెలంగాణ మొత్తం అప్పులు... రూ. 4,33,817.6 కోట్లుగా చెప్పుకొచ్చారు.