Telangana debt 2023 : తెలంగాణ అప్పు రూ. 3,66,306 కోట్లు - telangana debt2020
20:26 July 24
Breaking
తెలంగాణ రాష్ట్ర అప్పుల వివరాలను లోక్సభలో నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా వెల్లడించారు. 2023 మార్చి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పులు మొత్తం రూ. 3,66,306 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఈ అప్పు వివరాలను కేంద్ర ప్రభుత్వం క్రింది విధంగా వివరించింది.
క్రమ సంఖ్య | సంవత్సరం | అప్పు |
1 | 2023 | రూ. 3,66,306 కోట్లు |
2 | 2022 | రూ. 3,14,136 కోట్లు |
3 | 2021 | రూ. 2,71,259 కోట్లు |
4 | 2020 | రూ. 2,25,418 కోట్లు |
5 | 2019 | రూ. 1,90,203 కోట్లు |
- డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ పేరిట రూ.1407.97 కోట్లు
- హార్టీకల్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరిట రూ. 526.26 కోట్లు
- కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ పేరుతో రూ. 6528.95 కోట్లు
- క్రెడిట్ ఫెసిలిటీ ఫెడరేషన్స్ నుంచి టీఎస్సీఎస్సీఎల్ రూ. 15,643 కోట్లు, టిఎస్ మార్క్‌ఫెడ్ రూ. 483 కోట్లు
- రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ నిధి నుంచి రూ. 4,263 కోట్లు
- వేర్ హౌసింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిధి నుంచి రూ. 66.54 కోట్లు
వీటితో కలిపి తెలిపిన వాటితో కలిపి 2023 మార్చి నాటికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అప్పు రూ.3,66,306 కోట్లుగా కేంద్రం ప్రకటించింది. లోక్సభలో ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎంపీ నామ నాగేశ్వరరావుకి లిఖిత పూర్వకంగా తెలిపారు. రాష్ట్రంలో 2019 మార్చి నాటికి రూ. 1,90,203 కోట్లు, 2020 మార్చికి రూ. 2,25,418 కోట్లు, 2021 మార్చికి రూ. 2,71,259 కోట్లు, 2022 మార్చికి రూ. 3,14,136 కోట్లు ఉన్నదని కేంద్ర ప్రభుత్వం వివరించింది.
ఇవీ చదవండి :