తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana CS Sent New IPS List to EC : ఈసీ బదిలీ చేసిన పోస్టులకు ప్యానెల్ పంపిన రాష్ట్ర ప్రభుత్వం

Telangana CS Sent New IPS List to EC : పోలీస్‌ శాఖలో బదిలీ అయిన కమిషనర్లు, ఎస్పీల స్థానంలో కొత్త పోస్టింగ్‌ల కోసం జాబితాను సీఎస్‌కి డీజీపీ అంజనీకుమార్‌ పంపించారు. ఒక్కో పోస్టుకు సీనియారిటీ ప్రాతిపదికన ముగ్గురు ఐపీఎస్​లను పంపాలని సీఎస్​ శాంతికుమారిని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్ ఆదేశించించిన విషయం తెలిసిందే. ఈసీ ఆదేశాల మేరకు హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లతో పాటు 10 జిల్లాలకు ఎస్పీల పేర్లను సీఎస్​కి డీజీపీ పంపారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆ జాబితాను సీఈసీకి పంపించారు.

DGP Sent IPS Proposal List to CS in Telangana
Telangana

By ETV Bharat Telangana Team

Published : Oct 12, 2023, 8:10 PM IST

Telangana CS Sent New IPS List to EC : రాష్ట్రంలో కలెక్టర్లను, కమిషనర్లను, కొంతమంది ఎస్పీలను బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పోలీస్ శాఖలో బదిలీ అయిన కమిషనర్లు, ఎస్పీల స్థానంలో కొత్త పోస్టింగ్​ల కోసం డీజీపీ అంజనీకుమార్‌(DGP Anjani Kumar) జాబితాను సీఎస్​కు పంపించారు. ఒక్కో పోస్టుకు సీనియారిటీ ప్రాతిపదికన ముగ్గురు ఐపీఎస్​లను పంపాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్, సీఎస్ శాంతికుమారిని ఆదేశించింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లతో పాటు 10 జిల్లాలకు ఎస్పీల పేర్లను డీజీపీ సీఎస్​కు పంపించారు.

IPS Proposal List in Telangana 2023 :ప్రధానంగా హైదరాబాద్ సీపీ పైనే అందరి దృష్టి ఉంది. అదనపు డీజీ ర్యాంకు కలిగిన హైదరాబాద్ సీపీగా ఇప్పటి వరకు డీజీపీ హోదాలో ఉన్న సీవీ ఆనంద్(CV Anand) విధులు నిర్వహించారు. ప్రస్తుతం అదనపు డీజీ హోదా ఉన్న సీనియర్ ఐపీఎస్​ల పేర్లను డీజీపీ పంపించినట్లు తెలుస్తోంది. అదనపు డీజీల సీనియారిటీలో మొదట కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఆ తర్వాత శివధర్ రెడ్డి, అభిలాష బిస్త్, షికాగోయల్, వీవీ శ్రీనివాస్ రావు, మహేశ్ భగవత్, సజ్జనార్, నాగిరెడ్డి ఉన్నారు.

EC Transfers Several Collectors and SPs In Telangana : 20 మంది అధికారులపై ఈసీ వేటు.. ఎన్నికల విధుల నుంచి వారంతా ఔట్

DGP Sent IPS Proposal List to CS in Telangana :ఇందులో ముగ్గురు పేర్లను పంపాల్సి ఉండటంతో.. ఎవరెవరి పేర్లు సీఈసీకి వెళ్లాయనేది ఆసక్తిగా మారింది. వరంగల్, నిజామాబాద్ కమిషనర్లకు ఐజీ ర్యాంకు ఉన్న ఐపీఎస్​ల పేర్లు పంపించారు. జిల్లాల్లో ఎస్పీల పోస్టింగ్​ల కోసం ఐపీఎస్​ల పేర్లను పంపించారు. ఒక్కో పోస్టింగ్​కు మూడు పేర్ల చొప్పున మొత్తం 39 మంది పేర్లతో జాబితా సిద్ధం చేసిన డీజీపీ.. ఆ కాపీని సీఎస్​కు పంపించారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆ జాబితాను సీఈసీకి పంపించారు.

EC Transfers Several Collectors and SPs in Telangana :ఇటీవల హైదరాబాద్​లో సమీక్ష అనంతరం అధికారుల పనితీరు, వారిపై వచ్చిన ఫిర్యాదులు, గత అనుభవాలు, తదితరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను బదిలీ చేసింది. డబ్బు, మద్యం, ఇతరత్రాల పంపిణీ, మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా వచ్చిన ఫిర్యాదులు సహా ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలను ఈసీ బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే బదిలీ అయిన అధికారులు వెంటనే తమ కింది వారికి బాధ్యతలు అప్పగించి విధుల నుంచి తక్షణమే రిలీవ్ కావాలని స్పష్టం చేసింది.

EC Transfers Several Collectors and SPs in Telangana : హైదరాబాద్ సీపీ సహా పలువురు కలెక్టర్లు, ఎస్పీల బదిలీకి ఈసీ ఆదేశం

EC Focus on Money Laundering in Telangana 2023 : ఈసీ పంచముఖ వ్యూహం.. రంగంలోకి రిజర్వ్​ బ్యాంక్​.. డిజిటల్​ పేమెంట్స్​పై దృష్టి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details